సోనియా దయ వల్లే మీ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు

సోనియా దయ వల్లే మీ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు

సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలొచ్చాయన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.  ఇంటికో ఉద్యోగం పేరుతో టీఆర్ఎస్.. ఏటా రెండుకోట్ల ఉద్యోగాల పేరుతో మోడీ మోసం చేశారన్నారు. కిషన్ రెడ్డికి మోడీ ఉద్యోగం ఇస్తే.. కేసీఆర్ వాళ్ళ ఇంట్లోవాళ్లకు ఉద్యోగాలిచ్చారన్నారు. బిశ్వాల్ కమిటీ లక్ష 91వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పింది..మరి ఎప్పుడు భర్తీ చేశారన్నారు. కేటీఆర్ కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.

మచ్చలేని నాయకుడు చిన్నారెడ్డి అని టీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పాలన్నారు. కేసీఆర్ భయంతోనే.. పీవీ నర్సింహారావు బొమ్మతో ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. ఓడిపోయే చోట హరీష్ రావుకు ఇంచార్జ్ ఇచ్చాడన్నారు. ఎవరైన సొంత బిడ్డలకు పేర్లు పెట్టుకుంటారు కానీ.. పక్కొనికి పుట్టిన బిడ్డలకు పెట్టుకుంటరా అని ప్రశ్నించారు.  బీజేపీ నేత రామచందర్ రావు.. ఏనాడైన నిరుద్యోగుల గురించి మాట్లాడారా?అని అన్నారు.