ఏరుదాటాక తెప్ప తగలేయడం మామా, అల్లుళ్లకు అలవాటే: రేవంత్

ఏరుదాటాక తెప్ప తగలేయడం మామా, అల్లుళ్లకు అలవాటే: రేవంత్

బీఆర్ఎస్ లేకుండా కేంద్రం ఉండదనే మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి. ఏరుదాటాక తెప్ప తగలేయడం మామా, అల్లుళ్లకు అలవాటే అన్నారు రేవంత్ రెడ్డి. అదే విషయాన్ని  హరీష్ మరోసారి రుజువు చేశారన్నారు రేవంత్. మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచి, ఇప్పుడు ఎర్రజెండా మోసేటోడే లేడని మాట్లాడుతున్నారని అన్నారు. ఈ ఊసరవెల్లుల్ని కమ్యూనిస్టులు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే వారికి అంతమంచిదని ట్విట్టర్లో సూచించారు రేవంత్ రెడ్డి. 

ఆదివారం సిద్దిపేట అంగన్ వాడీల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన హరీశ్..  వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్ఎస్ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండదన్నారు. 2024లో బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపుతామని చెప్పారు.