కర్నాటక కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్​లో రేవంత్‌‌‌‌‌‌‌‌కు చోటు

కర్నాటక కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్​లో రేవంత్‌‌‌‌‌‌‌‌కు చోటు

  న్యూఢిల్లీ, వెలుగు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్స్ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి అధిష్టానం అవకాశం కల్పించింది. బుధవారం 40 మందితో స్టార్ క్యాంపెనర్స్ లిస్ట్‌‌‌‌‌‌‌‌ను ఏఐసీసీ రిలీజ్ చేసింది. ఇందులో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ సీఎం భూపేశ్ భాగేల్, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, శశిథరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు.