అమ్రాబాద్, వెలుగు: పశువులను అడవిలో మేపినందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు రూ. 2 లక్షల ఫైన్వేశారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లికి చెందిన కొందరు పశువులను మేపేందుకు వేసవిలో ఆంధ్ర ప్రాంతానికి వెళ్లారు. కొద్దిరోజుల క్రితం నాగర్కర్నూల్జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ఫారెస్ట్మద్దిమడుగు రేంజ్ పరిధిలోకి ఎంటర్ అయ్యారు. గుర్తించిన ఫారెస్ట్ ఆఫీసర్లు గురువారం ఉదయం ఫీల్డ్ కు వెళ్లి అశోక్, అంజి అనే ఇద్దరు పశువుల కాపరులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం పశువుల ఓనర్లను రప్పించారు. టైగర్ రిజర్వ్పరిధిలోని కోర్ ఏరియాలో దాదాపు రెండు వేల పశువులను ఉంచి అడవిలోని వన్యప్రాణుల ఆస్తికి నష్టం కలిగించారని మండిపడ్డారు. రెండు మందలకు రూ. రెండు లక్షలు చెల్లించాలని చెప్పారు. లేకపోతే పశువుల కాపర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
