కండక్టర్ రవీందర్ కు గుండెపోటు

కండక్టర్ రవీందర్ కు గుండెపోటు

వరంగల్ అర్భన్ :  ఆర్టీసీ సమ్మెతో మరో ఆర్టీసీ కార్మికుడికి గుండెపోటు వచ్చింది. హన్మకొండ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న ఎ. రవీందర్ గురువారం సాయంత్రం గుండె పోటుతో కుప్పకూలాడు. రవీందర్ ను వెంటనే హన్మకొండలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.