9 నెలల్లో 10 లక్షల పాలసీలు

9 నెలల్లో 10 లక్షల పాలసీలు

తొమ్మిది నెలల్లో 10 లక్షలకు పైగా బీమా పాలసీలు విక్రయించి రికార్డ్ సృష్టించింది ఆన్ లైన్  పాలసీ బజార్.కామ్. 2020 ఏప్రిల్-డిసెంబర్ మధ్యలో మొత్తం 10 లక్షల పైగా పాలసీలు విక్రయించింది. ఇందులో 4లక్షల వరకు ఆరోగ్య బీమా పాలసీలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ. 7 లక్షల కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది. బీమా పాలసీలు విక్రయించడానికి  ప్రధాన కారణాలు 1) కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తర్వాత ఆరోగ్య బీమా కోసం డిమాండ్ భారీగా పెరిగిపోవడం, 2) కొత్తగా వినూత్నమైన అధిక సమ్ ఇన్సూర్డ్ ప్రొడక్టులను ప్రవేశపెట్టడం 3) అనువైన చెల్లింపు ఆప్షన్లు,4) ఆరోగ్య బీమా పాలసీలను మరింత సులువుగా అలాగే చౌకగా కొనుగోలు చేయగలిగేలా దోహదం చేసే సరళతరమైన ప్రక్రియలు ఉండటమే కారణమని తెలిపింది.