
శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఈ నెల చివరి నుంచి ఇండియన్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 1.10 లక్షలు. 6.7 ఇంచెస్ మెయిన్ డిస్‌ప్లే(ఫోల్డ్ చేస్తే 1.1 ఇంచెస్), 12 ఎంపీ వెనుక కెమెరా, 10 ఎంపీ ఫ్రంట్ కెమెరా దీని సొంతం. ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ బ్యాటరీ సామర్ధ్యం 3,300 ఎంఏహెచ్. సెలక్ట్ ఔట్ లెట్స్, శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఫిబ్రవరి 21 నుంచి ప్రి–బుకింగ్స్ ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 26 నుంచి మొబైల్స్‌ను డెలివరీ చేస్తామని తెలిపింది.