సామ్‌‌సంగ్‌‌ నుంచి క్లామ్‌‌షెల్‌‌ ఫోన్‌‌

సామ్‌‌సంగ్‌‌ నుంచి క్లామ్‌‌షెల్‌‌ ఫోన్‌‌

ఇప్పటికే ఫోల్డబుల్‌‌ ఫోన్‌‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన ‘సామ్‌‌సంగ్‌‌’ త్వరలో మరో కొత్త ఫోల్డబుల్‌‌ ఫోన్‌‌ను విడుదల చేయనుంది. వచ్చే నెలలో ‘క్లామ్‌‌షెల్‌‌’ తరహా సెల్‌‌ఫోన్‌‌ను రిలీజ్‌‌ చేయబోతోంది. గతంలో విడుదల చేసిన ‘గెలాక్సీ ఫోల్డ్‌‌’ పుస్తకంలాగా మడతపెట్టొచ్చు. అయితే ఫిబ్రవరిలో విడుదల కాబోయే ఫోన్‌‌ అడ్డంగా పైనుంచి మధ్యలోకి (నత్తగుల్లలాగా) మడతపెట్టొచ్చు.

ఈ ఫోన్‌‌ 6.3 అంగుళాల స్క్రీన్‌‌తో రెగ్యులర్‌‌‌‌ ఫోన్‌‌లాగే ఉంటుంది. సామ్‌‌సంగ్‌‌ నుంచి రానున్న ‘గెలాక్సీ ఎస్‌‌ 11’ ఫోన్‌‌ కంటే ముందే ఈ ఫోల్డబుల్‌‌ ఫోన్‌‌ అందుబాటులోకి వస్తుంది. మరోవైపు ఈమధ్యే సామ్‌‌సంగ్‌‌ ‘గెలాక్సీ వాచ్‌‌ యాక్టివ్‌‌ 2–4జీ’ని విడుదల చేసింది. ఇది 4జీ నెట్‌‌వర్క్‌‌తో కూడిన ‘ఈ–సిమ్‌‌’ను సపోర్ట్‌‌ చేస్తుంది. దీనితో రెగ్యులర్‌‌‌‌ ఫోన్స్‌‌లాగే కాల్స్‌‌ చేసుకోవచ్చు. డాటా కూడా వాడుకోవచ్చు. ఫేస్‌‌బుక్‌‌, వాట్సాప్‌‌ వంటి సోషల్‌‌ మీడియా యాప్స్‌‌ కూడా వాడుకునే వీలుంది. వాకింగ్‌‌, స్లీపింగ్‌‌, సైక్లింగ్‌‌ వంటి 39 హెల్త్‌‌ అండ్‌‌ ఫిట్‌‌నెస్‌‌ యాక్టివిటీస్‌‌ను సపోర్ట్‌‌ చేస్తుంది. దీనిలో ఈ–సిమ్‌‌ సపోర్ట్‌‌ ఉన్నా ప్రస్తుతానికి ఎయిర్‌‌‌‌టెల్‌‌, జియో నెట్‌‌వర్క్‌‌లను మాత్రమే సపోర్ట్‌‌ చేస్తుంది. మరికొద్ది రోజుల్లో మిగతా నెట్‌‌వర్క్‌‌ల సేవలను అందిస్తామని సామ్‌‌సంగ్‌‌ చెప్పింది. దీని ధర సుమారు రూ.35,990.

ఎక్స్‌‌టెండబుల్‌‌ డిస్‌‌ప్లే

అందరికంటే ముందుగా ఫోల్డబుల్‌‌ ఫోన్‌‌ను తీసుకొచ్చిన ‘సామ్‌‌సంగ్‌‌’ మరో కొత్త ఫీచర్‌‌‌‌ను రూపొందిస్తోంది. అదే ‘ఎక్స్‌‌టెండబుల్‌‌ డిస్‌‌ప్లే’. అంటే అవసరమైనప్పుడు స్క్రీన్‌‌ సైజ్‌‌ పెంచుకోవచ్చు. ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించిన ‘మూవబుల్‌‌ బ్యాక్‌‌సైడ్‌‌ ప్లేట్‌‌’ ద్వారా ఈ ఫీచర్‌‌‌‌ పని చేస్తుంది. షావోమీ కూడా ఇలాంటి టెక్నాలజీలో పేటెంట్‌‌ తీసుకుంది.

Samsung to Release 'Clamshell Foldable Phone Before Galaxy S11 Series: Report