ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకోవాలి

ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకోవాలి
  • తెలంగాణ మాల సంఘాల  జేఏసీ చైర్మన్ దయానంద్

ముషీరాబాద్, వెలుగు: మాలలకు నష్టం కలిగించే స్సీ వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఎం.దయానంద్ డిమాండ్ చేశారు. ఆదివారం జవహర్ నగర్ లోని సామాజిక భవనంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ అనంతరం ఏర్పడిన రోస్టర్ పాయింట్లను సవరించాలన్నారు. 

వీటి వల్ల మాల విద్యార్థులు, ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 99 సవరించి, ఎస్సీలకు ప్రకటించిన 18 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. అనంతరం తెలంగాణ మాల సంఘాల జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్​గా దయానంద్, వర్కింగ్ కమిటీ చైర్మన్లుగా అనంత రాములు, కేశవులు, సత్యనారాయణ, కో చైర్మన్లుగా నర్మెట మల్లేశ్​, పద్మారావు, నరేశ్ ఎన్నికయ్యారు.