V6 News

పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
  • 20 మంది విద్యార్థులకు తప్పిన ప్రాణాపాయం
  • డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం

మేడ్చల్, వెలుగు: మేడ్చల్ పట్టణానికి చెందిన ప్రైవేటు స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్​ నిర్లక్ష్యంతో సోమవారం సాయంత్రం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ టైంలో బస్సులో ఉన్న దాదాపు 20 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. 

స్కూల్ వదిలిన తర్వాత మేడ్చల్​కు చెందిన చాణక్య విజన్ స్కూల్ బస్సు 20 మంది పిల్లలను తీసుకొని, రాయిలాపూర్ నుంచి బండ మాదారం వస్తోంది. మార్గమధ్యలో అతివేగంతో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న గ్రామస్తులు సకాలంలో స్పందించి విద్యార్థులను రక్షించారు. గాయపడిన పలువురు చిన్నారులను సమీప హాస్పిటల్​కు తరలించారు. 

Also Read : పాత గొడవలతో.. స్నేహితుడిపై కత్తితో దాడి