V6 News

కేపీహెచ్‎బీలో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

కేపీహెచ్‎బీలో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్: కేపీహెచ్‎బీ పోలీస్ స్టేషన్‎ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. కేపీహెచ్‎బీ పీఎస్‎కు కూతవేటు దూరంలో మెట్రో పిల్లర్ 734 దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జేఎన్టీయూ నుంచి కూకట్ పల్లి వెళ్లే జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు బస్సు అంతటా వ్యాపించడంతో నడిరోడ్డుపై బస్సు తగలబడింది. మంటలను ముందగానే గుర్తించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులను కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సహయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నడిరోడ్డుపై బస్సు దగ్ధం కావడంతో కేపీహెచ్‎బీలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.