మే 21న 17 రైళ్లు రద్దు.. మరి కొన్ని ఆలస్యం..వాటి వివరాలివే

మే 21న 17 రైళ్లు రద్దు.. మరి కొన్ని ఆలస్యం..వాటి వివరాలివే

సికింద్రాబాద్ డివిజన్ లో మే 20, 21న నడవాల్సిన పలు రైళ్లను  రద్దు చేయగా.. మరి కొన్నింటిని రీ షెడ్యూల్ చేశారు రైల్వే అధికారులు.  సికింద్రాబాద్ డివిజన్‌లోని ఘట్‌కేసర్ - చెర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య చర్లపల్లి కోచింగ్ టెర్మినల్ నిర్మాణ పనులు  జరుగుతుండటంతో  మే 21 న  17 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 20, 21న కొన్ని ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని తెలిపారు.

రద్దైన రైళ్లు

రద్దు చేయబడిన రైళ్లలో సికింద్రాబాద్-వరంగల్, హైదరాబాద్-కాజీపేట, కాచిగూడ-మిర్యాలగూడ, సికింద్రాబాద్-రేపల్లె, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-గుంటూరు, సికింద్రాబాద్-సిర్పూర్ ఖాగజ్‌నగర్ ఉన్నాయి.

ఆలస్యంగా నడిచే రైళ్లు

మే 20, 21 తేదీల్లో నడపాల్సిన హౌరా - సికింద్రాబాద్, త్రివేంద్రం - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - మన్మాడ్ సహా ఐదు రైళ్లు ఆలస్యంగా నడవడానికి రీషెడ్యూల్ చేయబడ్డాయి.