బ్లూ కాలర్ రిక్రూట్‌‌మెంట్‌‌పై సెమినార్‌‌ 

బ్లూ కాలర్ రిక్రూట్‌‌మెంట్‌‌పై సెమినార్‌‌ 

హైదరాబాద్, వెలుగు: ఖోస్లా వెంచర్స్,  ఎయిర్‌‌టెల్ వంటి పెట్టుబడిదారుల మద్దతు గల బ్లూ కాలర్ రిక్రూటర్​ వాహన టెక్నాలజీస్, హైదరాబాద్‌‌లో బ్లూ కాలర్ రిక్రూట్‌‌మెంట్‌‌పై సెమినార్‌‌ను నిర్వహించింది. ఫుడ్ డెలివరీ, క్విక్ సర్వీస్, ఈ–-కామర్స్,  తయారీ వంటి పరిశ్రమల నుంచి టెంపరరీ కార్మికులకు  డిమాండ్ పెరుగుతోందని తెలిపింది.  బ్లూ-కాలర్,  గిగ్ రిక్రూట్‌‌మెంట్‌‌ను పెంచుతామని తెలిపింది.  

ఈ సంస్థ సప్లై అక్విజిషన్ హెడ్ సిద్ధార్థ్ చౌహాన్ మాట్లాడుతూ   బ్లూ-కాలర్ ఉపాధిలో సవాళ్లను పరిష్కరించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం, 2030 నాటికి గిగ్​వర్కర్ల సంఖ్య 2.35 కోట్ల మందికి చేరుతుంది. 2020–2030 మధ్య  వీరి సంఖ్య 200శాతం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ భద్రత లేని కార్మికులను గిగ్​వర్కర్లు అంటారు.