వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్

వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్
  • సెమీస్లో నోరీపై గెలుపు 
  • 32వ సారి గ్రాండ్స్లామ్ ఫైనల్కు చేరిన తొలి ప్లేయర్ గా రికార్డు
  • కిరియోస్తో టైటిల్ ఫైట్

 

లండన్: సెర్బియా స్టార్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ .. వింబుల్డన్తో  జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. ఎదురొచ్చిన ప్రత్యర్థులను తనదైన శైలిలో ఓడిస్తూ ఫైనల్లోకి దూసుకుపోయాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీస్లో టాప్ సీడ్ జకో 2-6, 6-3, 6-2, 6-4తో 9వ సీడ్ కామెరాన్ నోరే (బ్రిటన్)పై గెలిచాడు. దీంతో వరుసగా నాలుగు, ఓవరాల్ కెరీర్ లో ఏడు. రెండోసెట్ లో 3-3 స్కోరు తర్వాత జాకో ఓవరాల్ కెరీర్లో ఏడో వింబుల్డన్ టైటిల్ తో 21వ గ్రాండ్ స్లామ్ కు అడుగు దూరంలో నిలిచాడు. దీంతో పాటు 32 సారి గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చేరిన తొలి ప్లేయర్ గా జొకో సరికొత్త రికార్డు సృష్టించాడు.  రోజర్ ఫెడరర్ (31) నాదల్ (30), ఇవాన్ లెండిల్(19),ఫీట్ సంప్రాస్ (18) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రెండు గంటలా 35 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో జోకో ఫస్ట్ సెట్ కోల్పోయాడు. కెరీర్లో ఫస్ట్ గ్రాండ్ సెమీస్ ఆడిన నోరీ.. తొలి సెట్ లో జొకో సర్వీసును మూడు సార్లు బ్రేక్ చేసి పైచేయి సాధించాడు. కానీ తర్వాత ఒక్క బ్రేక్ పాయింట్ కూడా కాపాడుకోలేకపోయాడు. రెండో సెట్ లో 3-3 స్కోరు తర్వాత జొకో 13 గేముల్లో 11 గెలిచాడు. ఫలితంగా నాలుగో సెట్ ను 2-0 లీడ్ తో  మొదలు పెట్టి ఈజీగా సెట్ తో పాటు మ్యాచును సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తం జొకో 13, నోరీ 7 ఏస్ లు సంధించారు. సెర్బియన్ ఒక్క డబుల్ ఫాల్ట్ చేస్తే, నోరీ మూడు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. 38 విన్నర్స్ సాధించిన జొకో..28 ఆన్ ఫోర్స్ డ్ ఎర్రర్స్ చేశాడు. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్లో జొకో..కిరియోస్ (ఆస్ట్రేలియా)తో తలపడతాడు. కిరియోస్కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్.