ఇది భారత భూభాగం.. మా గొర్రెలనుఇక్కడే మేపుతం

ఇది భారత భూభాగం.. మా గొర్రెలనుఇక్కడే మేపుతం
  • ఎల్ఏసీ వద్ద చైనా సైనికులను ఎదుర్కొన్న గొర్రెల కాపర్లు

శ్రీనగర్: వాస్తవాధీన రేఖ వద్ద భారత గొర్రెల కాపరులు చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లడఖ్​లోని ఎల్ఏసీ వెంట గొర్రెలను మేపొద్దంటూ చైనా దళాలు అభ్యంతరం  తెలుపగా.. భారత గొర్రెల కాపర్లు వారిని లెక్కచేయకుండా ధైర్యంగా నిలబడిన వీడియో వైరల్​గా మారింది. పాంగోంగ్​ సరస్సు సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి భారతీయ గొర్రెల కాపరులు గొర్రెల ను మేపుతూ ఉంటారు.

2020లో గాల్వాన్​ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత  తాత్కాలికంగా మానేశారు. ఇటీవల గొర్లతో అక్కడికి వెళ్లిన కాపర్లను  చైనా సైనికులు వారించారు. గొర్రెల కాపర్లు సైనికులను ఎదుర్కొని నిలబడ్డారు. ఆ ప్రాంతం భారత భూభాగంలోనే ఉందని వాదించారు. ఇంతలో భారత సైనికులు అక్కడికి చేరుకోవడంతో చైనా సైనికులు వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా ఎలాంటి హింస జరగలేదు. లడఖ్​లోని కాక్జంగ్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.