అవార్డుపై అభ్యంతరం ఉంటే హైకోర్టుకు రావాలి

 అవార్డుపై అభ్యంతరం ఉంటే హైకోర్టుకు రావాలి

హైదరాబాద్, వెలుగు : లోక్‌‌ అదాలత్‌‌లో ఓ కేసుపై రాజీ ఒప్పందం కుదిరాక.. దానిపై అభ్యంతరాలుంటే లోయర్‌‌ కోర్టుల్లో సవాల్‌‌ చేయకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం..అవార్డు(రాజీ ఒప్పందం )పై హైకోర్టులోనే సవాల్‌‌ చేసుకునే అవకాశముందని తెలిపింది.  రాజీ ఒప్పందాలను సమీక్ష చేసే పరిధి హైకోర్టులకూ పరిమితంగానే ఉంటుందని చెప్పింది. దంపతుల మధ్య వివాదంలో లోక్‌‌ అదాలత్‌‌ ఇచ్చిన అవార్డును రద్దు చేస్తూ.. వరంగల్‌‌ జిల్లా సివిల్‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు జడ్జి జస్టిస్‌‌ వెంకటేశ్వర్‌‌రెడ్డి కొట్టేశారు. అవార్డుపై అభ్యంతరం ఉంటే హైకోర్టుకు రావాలని సూచించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు, పంజాబ్‌‌ వర్సెస్‌‌ జలౌర్‌‌ సింగ్, భార్గవి కనస్ట్రక్షన్స్‌‌ వర్సెస్‌‌ ముత్యంరెడ్డి కేసుల్లో స్పష్టమైన గైడ్‌‌లైన్స్‌‌ ఇచ్చిందని గుర్తుచేశారు.