కరోనా వారియర్స్‌పై పూల వర్షం

కరోనా వారియర్స్‌పై పూల వర్షం
  • వ్యాధితో పోరాడుతున్న వారికి ఐఏఎఫ్‌ సత్కారం
  • హాస్పిటళ్ల దగ్గర హెలికాప్టర్లతో పూల వర్షం

న్యూఢిల్లీ: దేశంలో నుంచి కరోనాను తరిమికొట్టేందుకు పోరాడుతున్న ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, డాక్టర్లు, పోలీసులు, శానిటైజేషన్‌ సిబ్బందికి ఆర్మీ ఫోర్‌‌సెస్‌ సెల్యూట్‌ చేశాయి. దేశవ్యాప్తంగా కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ అందిస్తున్న హాస్పిటల్స్‌పై ఎయిర్‌‌ఫోర్స్‌ పూల వర్షం కురిపించింది. దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న హెల్త్‌ వర్కర్స్‌, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల సేవలను మెచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పోలీసులు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ వారి గౌరవార్థం త్రివిధ దళాల సర్వీస్‌ చీఫ్‌లు ఢిల్లీలోని పోలీస్‌ వార్‌‌ మెమోరియల్‌ దగ్గర పుష్పగుచ్చాలు ఉంచారు. ఆ తర్వాత ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌కు చెందిన సుఖోయ్‌ – 30, మిగ్‌ – 29, జాగ్వార్స్‌ ఢిల్లీలోని ఇండియా గేట్‌, రెడ్‌ఫోర్ట్‌పై ఎగిరాయి. కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇస్తున్న దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, జీటీబీ, రామ్‌ మనోహర్‌‌ లోహియా, సఫ్దార్‌‌గంజ్‌, శ్రీ గంగా రామ్‌, బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌‌, అపోలో ఇంద్రప్రస్తా, ఆర్మీ హాస్పిటల్స్‌లోని వైద్యులపై పూల వర్షం కురిపించారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌, కల్‌కత్తా, ముంబై, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లోనూ వైద్యులపై పూలవర్షం కురిపించారు. విశాఖ, ముంబై, చెన్నై, కొచ్చీలోని యుధ్ద నౌకులకు సాయంత్రం దీపాలంకరణ చేయనున్నారు.

గాంధీ ఆసుప్రతిపై పూలవర్షం

కరోనా పేషంట్లకు సేవలందిస్తున్న గాంధీ ఆసుపత్రిలోని డాక్టర్లతో పాటు, పోలీసులు, పారామెడికల్‌, శానిటైజేషన్‌ సిబ్బందిపై వాయుసేన హెలికాప్టర్‌‌ ద్వారా పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంఆ వైద్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ విశాఖలోని చెస్ట్‌ హాస్పిటల్‌, గీతం హాస్పిటల్స్‌పై ఎయిర్‌‌ఫోర్స్‌ పూల వర్షం కురిపించింది.