Eetha Teaser: 'ఈథ'గా శ్రద్ధా కపూర్ విశ్వరూపం.. గుండెల్ని పిండేస్తున్న లక్ష్మణ్ ఉటేకర్ మూవీ టీజర్!

Eetha Teaser: 'ఈథ'గా శ్రద్ధా కపూర్ విశ్వరూపం.. గుండెల్ని పిండేస్తున్న లక్ష్మణ్ ఉటేకర్ మూవీ టీజర్!

బాక్సాఫీస్ వద్ద 'ఛావా' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్‌.. ఇప్పుడు మహారాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో వస్తున్నారు.. అదే.. 'ఈథ' (Eetha). మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావణి, తమాషా జానపద కళాకారిణి వితాబాయి భావు మాంగ్ నారాయణ్‌గాంకర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'స్త్రీ' మూవీతో ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈథాబాయి ( ఈథ ) పాత్రలో నటిస్తోంది. లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.

గుండెల్ని పిండేసేలా టీజర్

టీజర్ చూస్తే గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.. భావు గాంకర్ తమాషా మండలి వేదికపై 'ఈథ' ప్రదర్శన కోసం జనం ఎగబడుతుంటారు. ఈథబాయిని పిలవండి అంటూ అరుస్తుంటారు. కానీ, బ్యాక్‌స్టేజ్‌లో సీన్ చూస్తే గుండె బరువెక్కుతుంది. తొమ్మిది నెలల గర్భిణి అయిన ఈత.. ప్రసవ వేదనతో ఎవరి సహాయం లేకుండా తానే బిడ్డకు జన్మనిస్తుంది. పసిపాప ఏడుపు వినిపిస్తుండగా.. నేను ఇలా బయటకు వెళ్లలేను, రెడీ అవ్వాలి అంటూనే, ప్రాణాలను పణంగా పెట్టి స్టేజ్ పైకి వచ్చేస్తుంది..

►ALSO READ | సమంత త్వరలోనే తల్లి కాబోతుందంటూ మెగాస్టార్ క్రేజీ ట్వీట్.. రాజ్, సామ్ దంపతులకు చిరు ఫ్యామిలీ స్పెషల్ గిఫ్ట్!

పడుకుని చస్తే అభాగ్యురాలు అంటారు.. అదే నృత్యం చేస్తూ చస్తే చరిత్ర అంటారు అంటూ శ్రద్ధా కపూర్ చెప్పే డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయి. టీజర్ చివర్లో మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ చెప్పే.. పాన్ లో రుచి చూడాలంటే మీఠా.. తుఫాన్ నాట్యం చేయడం చూడాలంటే.. 'ఈత ' అనే డైలాగ్ సినిమాపై హైప్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ శ్రద్ధా కపూర్ యాక్టింగ్ కు ఫిదా అయిపోయారు.

చరిత్ర సృష్టించిన వితాబాయి కథ..

ఈ చిత్రం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ నృత్యకారిణి ఈథాబాయి నారాయణ్‌గాంకర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తన లావణి, తమాషా ప్రదర్శనలతో తరతరాలను అలరించిన ఆమె ప్రతిభకు గానూ.. 1957, 1990లలో భారత రాష్ట్రపతి నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ఈ మూవీలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, రణదీప్ హుడా, అనంత్ జోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాడక్ ఫిలిమ్స్, కట్‌పుత్లీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బయోపిక్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  ఈ మూవీ 2026, ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.