సింగరేణి లాభాలు రూ.993 కోట్లు!

సింగరేణి లాభాలు రూ.993 కోట్లు!

మందమర్రి, హైదరాబాద్, వెలుగు: సింగరేణి బొగ్గు గనుల సంస్థకు  2019 – 20 ఫైనాన్షియల్ ఇయర్​లో రూ.993 కోట్ల లాభాలు వచ్చాయి. శనివారం హైదరాబాద్​లో సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్​ డైరెక్టర్స్ మీటింగ్​లో కంపెనీకి వచ్చిన లాభాలను వెల్లడించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే  గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ప్రెసిడెంట్​ బి.వెంకట్రావు సంస్థకు వచ్చిన లాభాలపై  స్పష్టతనిచ్చారు. కాగా, సింగరేణి కార్మికులకు యూనిఫాంలు అందించాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం నిర్ణయించింది. నాలుగు భూగర్భ గనుల మైనింగ్‌‌ ప్లాన్లకు, ఒక కొత్త ఓసీ గనికి, సింగరేణిలో మూడో దశ సోలార్‌‌ పవర్‌‌ ప్లాంట్ల నిర్మాణ కాంట్రాక్టులకు బోర్డు ఆమోదం తెలిపింది. కొత్తగూడెం పరిధిలో మరో ఓపెన్‌‌ కాస్ట్‌‌ గని నిర్మాణానికి, భూగర్భ గనుల విస్తరణలో భాగంగా కాజీపేట, ఆర్కే1 ఎ, శ్రీరాంపూర్‌‌ 1, శ్రీరాంపూర్‌‌ 3 & 3ఎ గనుల మైనింగ్‌‌ ప్లాన్స్ కు బోర్డు ఒకే చెప్పింది. సింగరేణి కార్మికులకు రెండు జతల యూనిఫాంలు అందించాలని బోర్డు నిర్ణయించింది. అందుకు రూ. 3.65 కోట్లతో వస్త్రాన్ని రాష్ట్ర చేనేత సహకార సంస్థ  (టెస్కో ) నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది.