
దేవాలయాల్లో దేవుడికి పువ్వులు సమర్పించడం హిందూమతంలో అత్యంత పవిత్రమైన ఆచారాలలో ఒకటి. కేరళలోని ఆలయాల్లో దేవుడికి సమర్పించే నైవేద్యం, అలాగే భక్తులకు ఇచ్చే ప్రసాదంలో అరళి (ఒలియాండర్) పువ్వులను నిషేదించారు. అరళి పువ్వుకు బదులు భక్తులు తులసి ఆకులు, తేచి (జంగిల్ జెరేనియం) మందార నైవేద్యంగా సమర్పించాలని సూచించారు. కేరళలోని అలప్పుజా జిల్లాలో ఓ మహిళ మృతి చెందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేరళ ఆలయ అధికారులు తెలిపారు. ప్రమాదవశాత్తు అరలి ఆకులు తినడం వల్లే ఆమె చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ప్రసిద్ధ శబరిమల పుణ్యక్షేత్రంతో సహా దక్షిణ కేరళలోని ఆలయాలను ఎక్కువగా నిర్వహిస్తున్న ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ దేవాలయాల్లో అరళి పుష్పాన్ని నిషేదించినట్లు చెప్పారు. అరలీ పువ్వులలో విషపూరితమైన కంటెంట్‌పై ఆందోళనల కారణంగా నిషేధించినట్లు తెలిపారు. టీడీబీ ఆధ్వరంలోని 1248 ఆలయాల్లో నైవేద్యం, ప్రసాదాల్లో అరలి పువ్వులను వాడొద్దని సూచించారు.
అలప్పుజా జిల్లాలో ఓ మహిళ ప్రమాదవశాత్తూ అరళి ఆకులను తీసుకోవడం వల్ల అస్వస్థతకు గురై మరణించింది. ఈ ఘటన జరిగి దాదాపు 10 రోజుల తర్వాత ఈ పువ్వు వాడకంపై నిషేధం విధించారు. యూకేలో నర్సుగా ఉద్యోగం పొందిన సూర్య సురేంద్రన్ కొచ్చిన్ ఏప్రిల్ 28న అంతర్జాతీయ విమానాశ్రయంలో వాంతులు చేసుకుని కుప్పకూలిపోయింది. ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మహిళ పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె రక్తంలో ఏదో ఒక మూల విషపూరిత పదార్థం ఉన్నట్లు తేలిందని హరిపాడ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె. అభిలాష్ కుమార్ తెలిపారు.
టాక్సిక్ కంటెంట్ ఉన్న అరళి ఆకులను ఆమె ప్రమాదవశాత్తూ తినడమే ఆమె మరణానికి దారితీసిందని మేము నమ్ముతున్నాము. ఆమె తిరువల్లలోని వైద్యులకు ఆ ఆకును తిని ఉమ్మివేసినట్లు చెప్పింది. కానీ ఆకు రసం లోపలికి వెళ్లి ఉండవచ్చు, ఇది గుండెపోటుకు దారితీసింది, చివరికి ఆమెకు గుండె జబ్బులు లేవు కాబట్టి, ఆమె మరణానికి వేరే కారణం లేదని వెల్లడించారు. ఆమె రక్త నమూనాలను ల్యాబ్ కు పంపామని మరి కొన్ని రోజుల్లో నివేదిక వస్తుందని తెలిపారు.
సాధారణంగా అరళి ఆకులని పిలువబడే నెరియం ఒలియాండర్ అన్ని భాగాలలో విషపూరిత సమ్మేళనాలను కలిగి ఉంది. దానిని తీసుకోవడం వల్ల వాంతులు, వికారం, రక్త విరేచనాలు, సక్రమంగా గుండె లయ తప్పడం జరుగుతుందని శాస్త్రీయంగా తేలింది.