తమిళనాడు ఎన్నూర్, కట్టుపల్లి పోర్టుల్లో గురువారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందలాది ట్రక్కులు రోడ్డుపై దాదాపు 8గంటల పాటు నిలిచి ఉంటున్నాయి. పోర్ట్ లో ట్రక్కులు అన్ లోడ్ చేయడానికి ఆలస్యం అవుతుంది. ఎన్నోర్ హైరోడ్డుపైన 10కిలో మీటర్ల మేర ట్రక్కులు క్యూలో నిలవడి ఉన్నాయి. అన్ లోడింగ్ పూర్తిగా ఎలక్ట్రిసిటిపై ఆదారపడటం వల్లే ఈ సమస్య వచ్చిందని లాజిస్టిక్ అధికారులు చెప్తున్నారు. ఎంట్రీ పాయింట్, కస్టమ్ చెక్ పోస్టుల దగ్గర సిగ్నల్ సమస్యలు రావడం వల్ల ఇలా జరిగిందని తెలిపారు. రాకపోకలను తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీని కారణంగా చెన్నై సిటీలో కూడా ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు.
