Chiranjevi: ఈ జీవితమే అమ్మది.. మథర్స్ డే రోజున మెగాస్టార్ స్పెషల్ పోస్ట్

Chiranjevi: ఈ జీవితమే అమ్మది.. మథర్స్ డే రోజున మెగాస్టార్ స్పెషల్ పోస్ట్

నేడు(మే 12 ) మథర్స్ డే సందర్బంగా ప్రతీఒక్కరు తమ అమ్మని తలుచుకుంటున్నారు. అమ్మతో తమకున్న తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన తల్లి అంజనా దేవి(Anjana Devi) గురించి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశారు. తన అమ్మతో దిగిన ఫోటోలను చేస్తూ.. కని, పెచి, పోషించిన అమ్మకి ఈ ఒక్కరోజు ఏంటి.. ప్రతిరోజు అమ్మదే.. ఈ జీవితమే అమ్మది.. అమ్మ లేని జీవితం ఊహించుకోలేము. హ్యాపీ మథర్స్ డే అంటూ.. ట్వీట్ చేసారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన యంగ్ డైరెక్టర్ వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్ సంస్థలో వస్తున్న ఈ భారీ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.