హలో..దుబాయ్.. యూఏఈ చేరిన ఆరు జట్లు

హలో..దుబాయ్.. యూఏఈ చేరిన ఆరు జట్లు

తొలి రోజు హోటల్ బాల్కనీ, లాన్ లో కసరత్తులు

దుబాయ్: ఎడాది దేశంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఎనిమిది ఫ్రాంచైజీల్లోఆరు జట్లు యూఏఈలో అడుగు పెట్టాయి. రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దుబాయ్ లో, కోల్ క‌తా నైట్ రైడర్స్ అబుదాబీలో గురువారమే ల్యాండ్ అవగా..శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ కూడా యూఏఈ లో ఏర్పాటు చేసుకు న్న తమ బేస్ కు చేరుకున్నాయి. బీసీసీఐ స్టాండర్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తో పాటు, స్థానిక నిబంధనల ప్రకారం ప్లేయర్లంతా ఆరు రోజులు క్వారంటైన్లో ఉండాలి. దీంతో తొలి రోజు అందరూ హోటల్ రూమ్స్ లోనే ఉండిపోయారు. రూమ్ బాల్కనీల్లోకి వచ్చి తేలికపాటి ఎక్స్ ర్ సైజులు చేశారు.

కొందరు ప్లేయర్లు తమ బాల్కనీలోకి వచ్చి పక్క రూమ్ లో ఉన్న ప్లేయర్ల‌తో ముచ్చట్లు పెట్టుకున్నారు. రాయల్స్ ప్లేయర్లు కొందరు ఒకరి తర్వాత ఒకరు ఔట్ డోర్ ఏరియాలో చిన్నఎక్సర్ సైజ్ లు చేశారు. ఆ టీమ్ మెంబర్ శ్రేయస్ గోపాల్ లాన్ లో పుషప్స్ చేస్తూ కనిపించాడు. బయోబబుల్లో తమ ఫస్ట్ డే ఎక్స్ పీరియన్స్ కు సంబంధించిన ఫొటోలను క్రికెటర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక , పంజాబ్ ప్లేయర్లు దుబాయ్ఎయిర్ పోర్ట్ లో దిగిన వెంటనే కరోనా టెస్ట్ ల కోసం వారి శాంపిల్స్ క‌లెక్ట్ చేశారు. అయితే ఎండ వేడిమి వల్ల వారంతా పూర్తిగా రూమ్స్ లోనే ఉండిపోయారు. నిబంధనల ప్రకారం ట్రెయినింగ్ ప్రారంభించే లోపు ప్రతీ ప్లేయర్ కు మూడు సార్లు కరోనా టెస్ట్ లు తప్పనిసరిగా చేయించాలి.

ఫ్యామిలీస్‌తో ముంబై ఇండియన్స్
ముంబై టీమ్ అబుదాబీ బేస్ గా ఉండనుంది. జట్టు కెప్టెన్ రోహిత్ సహా పలువురు ప్లేయర్లు తమ ఫ్యామిలీస్ తో అక్కడికి వెళ్లారు. ఇక, ధోనీ కెప్టెన్సీ లోని సీఎ స్కే టీమ్ ప్రత్యేక విమానంలో దుబాయ్ లో ల్యాండ్ అయ్యింది. బెంగళూరు కూడా దుబాయ్ లోనే బేస్‌ ఏర్పాటు చేసుకుంది. అయితే, ఆ టీమ్ సోషల్ మీడియాలో పెట్టిన గ్రూప్ ఫొటోలో విరాట్ కనిపించకపోవడంతో కోహ్లీఎక్కడా అని ఫ్యాన్స్ ప్రశ్నించారు. దాంతో, టీమ్ హోటల్లో కోహ్లీ దిగిన ఫొటోను ఆర్సీబీ ట్విట్టర్ లో షేర్ చేసింది. అతను టీమ్ విమానంలో కాకుండా స్పెషల్ ఫ్లైట్ లో ప్రయాణించాడు. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్రస్తుతం ముంబై చేరుకున్నాయి. సన్రైజర్స్ శ‌నివారం యూఏఈ బయలుదేరే అవకాశం ఉండగా.. ఢిల్లీ రెండు రోజుల తర్వాత ఫ్లైట్ ఎక్కనుంది.

మలింగ ఆలస్యంగా..

ముంబై స్టార్ పేసర్ లసిత్ మలింగ ఈసారి ఐపీఎల్ లో తొలి భాగానికి దూరమవ్వడం దాదాపు ఖాయమైంది. మలింగ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో అతను ఇప్పట్లో యూఏఈ బయలుదేరే చాన్స్ లేదు. తన తండ్రికి అతి త్వరలో సర్జ‌రీ జరగ నుంది. అది పూర్తి అయిన తర్వాతే మలింగ అందుబాటుపై క్లారిటీ వస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం