సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రామచంద్రపురం పరిధిలోని అశోక్ నగర్ లోని ఓ ఫుట్ వేర్ షాపులో ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫుట్ వేర్ షాప్ పూర్తిగా కాలిపోయింది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

అగ్ని ప్రమాదంపై కేసు  నమోదు చేసుకున్న అధికారులు షార్ట్ సర్క్యూట్ తోనే అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించారు. షాపు పూర్తిగా దగ్ధం అవ్వడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.