శంషాబాద్ లో లిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గురువారం ( మార్చి 12 ) ఘనంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి ఏర్పాట్లు, వైద్య సదుపాయాలను పరిశీలించారు భట్టి విక్రమార్క. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ముఖ్య లక్ష్యంగా పని చేయాలని, ముఖ్యంగా పేద ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలని సూచించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం కార్యక్రమానికి హాజరైన ప్రముఖులను ఘనంగా సన్మానించి సత్కరించింది.
