బానిస బతుకులు, బాంచన్ బతుకులు మనకొద్దు

బానిస బతుకులు, బాంచన్ బతుకులు మనకొద్దు
  • అమరుల సంస్మరణ సభలో ప్రజా గాయకుడు గద్దర్ 

హైదరాబాద్: బానిస బతుకులు, బాంచన్ బతుకులు మనకొద్దు.. అని ప్రజా గాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. జాతి కోసం పోరాడే భావజాలం రావాలని ఆయన పిలుపునిచ్చారు. మన మధ్య ఎలాంటి వైరుద్యాలు లేనపుడు మాత్రమే మనం ముందుకు నడవగలం అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం లకిడికపూల్ అంబేద్కర్ రిసోర్స్ సెంటర్ లో దళిత అమరుల శ్రద్ధాంజలి సభ జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న గద్దర్ మాట్లాడుతూ ఈ ముగ్గురు వీరులు తనకు చాలా బాగా పరిచయం అని గుర్తు చేసుకున్నారు. విప్లవొద్యమం, అంబేద్కర్ భావజాలలు కలిపి ఉద్యమం చేశారని పేర్కొన్నారు. 

బాలనాధం గారు పట్టణ ప్రాంతాల్లో బడుగుల అన్యాయం పై పోరాడితే, రాజారామ్ గారు పల్లె పోరాటాలు చేశారంటూ గద్దర్ తనదైన శైలిలో పాటలు పాడి నివాళులు అర్పించారు గద్దర్. రాజారామ్ చనిపోయాక మంథని వెళ్లాను, ఒక లీడర్ ను తయారు చేయాలంటే, ఒక ఉద్యమం నడపాలంటే చాలా కష్టం, చాలా సమయం పడుతుంది, పాలక వర్గాల రాజకీయ అధికారం పౌరుల  భావజాలం మీద ఆధారపడి ఉండాలి అని గద్దర్ పేర్కొన్నారు. మానవ సమాజాన్ని విచ్చిన్నం చేసే కుట్రలను తిప్పి కొట్టడమే విప్లవం, కులం కోసం పోరాడే భావజాలం పోవాలన్నారు. సంస్కృతమైన దండయాత్ర జరుగుతోంది, జాతి కోసం పోరాడే భావజాలం రావాలన్నారు. అమరుల ఆశయాలు కొనసాగించాల్సి ఉంది, శ్రద్ధాంజలి ఘటించడం అంటే వాళ్ల దారిలో నడవడం అన్నారు. జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన అమరులకు జోహార్లు అర్పించారు ప్రజా గాయకుడు గద్దర్.