యూట్యూబ్‌లో కొత్త ఫీచర్లు: ఛానల్స్‌కు QR కోడ్, గూగుల్ లెన్స్ సెర్చ్

యూట్యూబ్‌లో కొత్త ఫీచర్లు: ఛానల్స్‌కు QR కోడ్, గూగుల్ లెన్స్ సెర్చ్

గూగుల్ సంస్థ యూట్యూబ్ యూజర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. అతి పెద్ద వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం అయిన యూట్యూబ్ కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. వరల్డ్ వైడ్ మిలియన్ల కొద్ది ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, న్యూస్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ మిలియన్ల కొద్దీ యూజర్లను సంపాధించుకున్న యూట్యూబ్ ఫ్లాట్ ఫాం అప్డేట్ ప్రకటించింది. ఏఐ లైవ్ చాట్, ఛానల్ కోసం క్యూఆర్ కోడ్, అలాగే గూగుల్ లెన్స్ సెర్చ్ ఆప్షన్స్ అందుబాటులోకి తేవడానికి యూట్యూబ్ పని చేస్తోంది. యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త ఫీటర్లు ఇవే..

AI లైవ్ చాట్ బాట్: 

ఏఐ పవర్డ్ లైవ్ చాట్ సమ్మరీస్ లైవ్ స్టీమింగ్ లో ఛాట్ సెషన్ రానుంది. లైవ్ లో ఉన్నప్పుడు  ఒక స్పెషల్ బ్యానర్ ఓపెన్ అవుతుంది. కొన్ని కీ కాంమెట్స్ పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. స్పెషల్లీ బిజీ స్టీమింగ్ సెషన్ లో ఇది బాగా ఉపయోగపడుతుంది.

వీడియోస్ కోసం గూగుల్ లెన్స్ సెర్చ్:

వీడియో కంటెంట్ కోసం ఇప్పటి వరకు వాయిస్ సెర్చ్, కీ బోర్డ్ సెర్చ్ మాత్రమే యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.  ఇప్పుడు గూగుల్ లెన్స్ ద్వారా వీడియో సెర్చ్ చేసే ఆప్షన్ రానుంది. యూజర్లు ఇమేజ్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు.

ఛానల్స్ కు క్యూఆర్ కోడ్:

యూట్యూబ్ లో ఛానల్స్ నడిపిస్తున్న వారికి క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తోంది. ఆయా ఛానల్స్ షేర్ చేసుకోవాలంటే ఆ క్యూఆర్ కోడ్ తో షేర్ చేసుకోవచ్చు.  అంతే కాదు రిలేటెడ్ ఛానల్స్ ఏవీ చూపించకుండా డైరెక్టగా అదే ఛానల్ ఓపెన్ అవుతుంది.

ఈ ఫీచర్లు సెలెక్టెడ్ ఆపరేటింగ్ యూజర్లకు ముందుగా అందుబాటులోకి తీసుకురావాలని YouTube చూస్తోంది. ఈ అప్డేట్లు ఎప్పుడు వస్తాయనే విషయం త్వరలోనే యూట్యూబ్ ప్రకటిస్తుంది.