తమిళనాడులో హీటెక్కిన రాజకీయాలు..NDA కూటమిలో చేరిన PMK

తమిళనాడులో హీటెక్కిన రాజకీయాలు..NDA కూటమిలో చేరిన PMK

అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది..పట్టాలి మక్కల్ కట్చి (PMK) పార్టీ ఎన్డీయే కూటమితో జతకట్టింది. బుధవారం ( జనవరి 7) పీఎంకే చీఫ్ అంబుమణి రామదాస్. AIADMK, ఎన్డీయే కూటమిలో చేరారు. చెన్నైలో AIADMKచీఫ్, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామిని కలిసి రామదాస్ ఎన్డీయే కూటమిలో చేరినట్లు ప్రకటించారు. 

అంబుమణి  చేరికపై స్పందించిన AIADMKచీఫ్ పళని స్వామి.. పీఎంకే చేరికతో కూటమి మరింత బలపడిందన్నారు. ఇతర పార్టీలు కూడా  ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. ఈ కూటమి విక్టరీ అలయన్స్ అని ప్రకటించారు. 

అందరం కలిసికట్టుగా పనిచేసే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  కూటమి విజయపథంలోనడిపిస్తామన్నారు పీఎంకే చీఫ్ అంబుమణి రామదాస్.మహిళలు,  ప్రజా వ్యతిరేక ,అవినీతి పార్టీ డీఎంకే ను గద్దె దించడమే లక్ష్యంగా  పనిచేస్తామన్నారు. భారీ మెజారిటీతో గెలిచి అన్నాడీఎంకే నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాందాస్ అన్నారు.

మరోవైపు టీవీకే చీఫ్ ను ఎన్డీయే కూటమి చేర్చుకునే ప్రయత్నాలు బీజేపీ సీరియస్ గా చేస్తుందని ప్రచారం సాగుతున్న సమయంలో తాజా రాజకీయ పరిమాణం చర్చనీయాంశమైంది. అధికార డీఎంకే ను ఓడించేందుకు తమతో కలిసి రావాలని టీవీకే చీఫ్ విజయ్ కి గతంలో పళని స్వామి ఆఫర్ ఇచ్చారు. ఈ క్రమంలో విజయ్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పొత్తులతో ప్రతిపక్షాలు బలోపేతం అవుతున్న వేళ సీఎం స్టాలిన్ విపక్ష కూటమిని ఎలా ఎదుర్కొంటుందనే అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది.