ఫోన్ ట్యాపింగ్ కేసు..ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి, కూకట్ పల్లి ఎమ్మెల్యే కొడుకుకు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు..ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి, కూకట్ పల్లి ఎమ్మెల్యే కొడుకుకు సిట్ నోటీసులు

 తెలంగాణలో సంచలనం సృష్టించిన  ఫోన్ ట్యాప్ కేసులో  సిట్ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావు, కూకట్ పల్లి బీఆర్ఎస్  ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు కొడుకు సందీప్ రావుకు సిట్  నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పీఎస్ లో విచారణకు రావాలని నోటీసులో తెలిపింది. జనవరి 7న మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కొండల్ రావు,సందీప్ రావు ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. 

 ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ విచారించింది. ఎస్ఐబీ కేంద్రంగా పని చేసిన స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ కోసం సాఫ్ట్​వేర్ కొనుగోలుకు సంబంధించిన వివరాలతో స్టేట్​మెంట్ రికార్డు చేసింది. ఈ మేరకు నవీన్ రావును సిట్ సభ్యులు గ్రేహౌండ్స్ డీఎస్పీ రవీందర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సుదీర్ఘంగా ప్రశ్నించారు.  .2024 సెప్టెంబర్ లో రికార్డ్ చేసిన స్టేట్ మెంట్ ఆధారంగా వివిరాలు సేకరించారు. ప్రధానంగా ఎస్ఐబీ చీఫ్ గా ప్రభాకర్ రావు సహా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించడానికి గల కారణాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఎవరు చెప్తే రూ. కోట్లు పెట్టి సాఫ్ట్ వేర్ తెప్పించారు? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ప్రశ్నల వర్షం కురిపించారు. 

తెరవెనుక నవీన్ రావు 

గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన నవీన్ రావు.. సిటీ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహాలోనే ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓటీ పోలీసులతో స్పెషల్ ఆపరేషన్స్ చేసేందుకు తమ సామాజిక వర్గ అధికారులను నియమించడం లోనూ కీలకంగా వ్యవహరించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ప్రభాకర్ రావు సహా నిందితుల స్టేట్ మెంట్ల ప్రకారం.. నవీన్ రావు ఆధ్వర్యంలోనే ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్లు సిట్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ప్రభుత్వానికి సంబంధించిన నిధుల నుంచి కాకుండా ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తుల ద్వారా ట్యాపింగ్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పరికరాలను సేకరించినట్లు తెలిసింది. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ నిధుల నుంచి అనుమతులు లేని సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్స్ కొనుగోలు చేస్తే చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నందున ఎమ్మెల్సీ నేతృత్వంలో ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మలేసియా దేశాల నుంచి ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్యాపింగ్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెప్పించారని సమాచారం. ఈ మేరకు డబ్బు తరలింపుపై కూడా స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోకస్ చేసింది. ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా కార్పొరేట్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ఫండ్ కలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ప్రణీత్ రావు ప్రత్యేక నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసుకున్నట్టు సిట్ గుర్తించినట్లు తెలిసింది. పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, ఫార్మా, ఐటీ కంపెనీల వద్ద ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేకరించే వారని ఆధారాలు సేకరించింది. ఇక నవీన్ రావు ఇచ్చిన సమాచారంతో ప్రముఖ నేతలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.