కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) ఫిట్టర్, మెషినిస్ట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ జనవరి 23.
ఖాళీలు: 210.
విభాగాల వారీగా ఖాళీలు: వెల్డర్ కం ఫిట్టర్ (వెల్డర్/ వెల్డర్ గ్యాస్ & ఎలక్ట్రిక్) 40, వెల్డర్ కం ఫిట్టర్ (షీట్ మెటల్ వర్కర్) 56, వెల్డర్ కం ఫిట్టర్ (ఫిట్టర్) 33, వెల్డర్ కం ఫిట్టర్ (ప్లంబర్) 05, వెల్డర్ కం ఫిట్టర్ (మెకానిక్ మెటార్ వెహికల్) 04, వెల్డర్ కం ఫిట్టర్ (మెకానిక్ డీజిల్) 14, మెషినిస్ట్ 06, ఫిట్టర్ (ఎలక్ట్రికల్) 17, ఫిట్టర్ (ఎలక్ట్రానిక్స్) 08, క్రేన్ ఆపరేటర్ (ఎలక్ట్రికల్) 07, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ 07, షిప్ వ్రైట్వుడ్ 04, పెయింటర్ 09.
విద్యార్హతలు
గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదో తరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడులో ఐటీఐ (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత ట్రేడులో ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (నేషనల్ అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్) కలిగి ఉండాలి. కనీసం ఐదేండ్ల పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి (2026, జనవరి 23 వరకు): 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మెన్ లకు సైనిక సేవా కాలాన్ని వాస్తవ వయసు నుంచి తీసివేసి మూడేండ్లు కలుపుతారు. అయితే, గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లుగా ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 06.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.700. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
లాస్ట్ డేట్: జనవరి 23.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఫేజ్–1
ఫేజ్–1లో ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. మొత్తం 30 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్–ఏ జనరల్ నాలెడ్జ్ 5 ప్రశ్నలు 5 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 5 ప్రశ్నలు 5 మార్కులకు, పార్ట్–బీలో ట్రేడ్ సంబంధిత విషయాలపై 20 ప్రశ్నలు 20 మార్కులకు అడుగుతారు. ఒక్క ప్రశ్నకు 1 మార్కు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు.
ఫేజ్–2
ఫేజ్–2లో ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. సంబంధిత ఐటీఐ ట్రేడులపై 70 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 100 మార్కులు (ఫేజ్–1 + ఫేజ్--2).
కనీస అర్హత మార్కులు: అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50 శాతం, ఓబీసీ అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఫైనల్ సెలెక్షన్: ఫేజ్–1, ఫేజ్–2లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.cochinshipyard.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
