Abishan Jeevinth: 25 ఏళ్లకే ఆస్కార్ రిమైండర్ లిస్ట్‌లో చోటు.. డైరెక్టర్ అభీషన్ సెన్సేషనల్ జర్నీ

Abishan Jeevinth: 25 ఏళ్లకే ఆస్కార్ రిమైండర్ లిస్ట్‌లో చోటు.. డైరెక్టర్ అభీషన్ సెన్సేషనల్ జర్నీ

అభీషన్ జీవింత్ (Abishan Jeevinth)​.. ఒకే ఒక్క సినిమా అతని జీవితాన్ని మార్చేసింది. చిన్నప్పటినుంచి ‘సినిమా సినిమా’ అనేవాడు. అదే సినిమా అతన్ని డైరెక్టర్​ని చేసింది. యాక్టర్​ని చేసింది. సరిగ్గా పాతికేండ్లు వచ్చేసరికి ఆస్కార్​ రిమైండర్ లిస్ట్​లో అతను డైరెక్ట్​ చేసిన సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ పేరుంది.

గతేడాది వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామా ఎన్నో అవార్డులతోపాటు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఇంతకంటే గొప్ప సక్సెస్​ ఉంటుందా? అని ప్రశ్నించేలోపే హీరోగా మారి మరో సక్సెస్ అందుకున్నాడు. ‘కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించొచ్చు’ అని తన సక్సెస్​లతో నిరూపించాడు​. లేటెస్ట్​గా ‘విత్ లవ్’​ అంటూ యూత్​ని ఆకట్టుకున్న అభీషన్ జర్నీ తన మాటల్లో... 

నేను పుట్టింది ట్రిచీ. తిరుచిరాపల్లిలో స్కూల్ ఎడ్యుకేషన్​ పూర్తిచేశాను. చెన్నైలోని లొయొలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్​లో డిగ్రీ పూర్తి చేశాను. ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచే నేను ఫిల్మ్ మేకర్ అవుతానని అందరితో చెప్పేవాడిని. మా స్కూల్లో టీచర్స్ కూడా ఆశ్చర్యపోయి, మా అమ్మతో చెప్పేవాళ్లు. టెన్త్​లో కూడా నేను మా ఇంట్లో అదే చెప్పాను. దాంతో మా పేరెంట్స్ భయపడ్డారు. ఆ తర్వాత నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్స్​లో గెలుస్తూ ఉండడంతో నెమ్మదిగా వాళ్లకి నా మీద నమ్మకం వచ్చింది. నా స్టేజ్​ పర్ఫార్మెన్స్​లు చూసి నాకు సినిమాలే ఇంట్రెస్ట్ అని ఫిక్స్ అయిపోయారు. 

‘తెనాలి’ సినిమాకి సెకండ్ పార్ట్​లాగా..

డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్​గా అవకాశం వచ్చింది. కానీ, కొవిడ్ వల్ల అది వర్కవుట్ కాలేదు. ఫైనల్ ఇయర్ పూర్తయ్యాక అదే కంపెనీలో వేరే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్​గా సైన్ చేశాను. ఆ అవకాశం కూడా కలిసిరాలేదు. కొవిడ్ తర్వాత ఎలాంటి సబ్జెక్ట్ బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు అందరికీ నచ్చేలా ఫ్యామిలీ ఎంటర్​టైనర్​ అయితే బెటర్ అనిపించింది. కమల్ హాసన్ నటించిన ‘తెనాలి’ సినిమాకి సెకండ్ పార్ట్​ కోసం నా దగ్గర ఒక ఐడియా ఉందని ఆ ప్రొడక్షన్​ కంపెనీకి చెప్పాను. ఆ సబ్జెక్ట్​ని డెవలప్​ చేయడం మొదలుపెట్టాను. అలా ఒక ఫ్యామిలీని ఊహించి కథ రాశాను.

ఆ టైంలోనే ‘మిలియన్ డాలర్ లవర్’ అనే సినిమా చూశాను. లవ్​ చేసి పెండ్లి చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాసుకున్న స్టోరీ లైన్​ని మెయిల్ చేశాను. అది చూసి నెరేషన్ ఇవ్వమని అడిగారు. స్టోరీ విన్నాక వాళ్లకు బాగా నచ్చడంతో డైరెక్టర్​గా చాన్స్ ఇచ్చారు. అలా నేను రాసుకున్న కథతో డైరెక్టర్​గా మారాను. అదే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. కొత్త పాయింట్​తో సినిమా తీశాం, ఆడియెన్స్​కి నచ్చుతుంది అనుకున్నాం. కానీ ఇంత గొప్ప రెస్పాన్స్ వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. 

ఫిల్మ్ డైరెక్షన్​ గురించి..

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ తీసేటప్పటికి నా వయసు 25 ఏండ్లు. కానీ ఇంతకంటే ముందే నేను డైరెక్టర్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఫైనల్ ఇయర్​లో ఉన్నప్పుడే నేను ఫిక్స్ అయ్యాను. అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్​గా మూవీకి సైన్ చేశాను కాబట్టి నేను ఒక ఆఫీస్​ పెట్టుకోవాలనుకున్నా. మా అమ్మ కోసం ఒక సినిమా తీయాలి అనుకున్నాను. కానీ కొవిడ్ వల్ల అవన్నీ ఆగిపోయాయి. నిజానికి అప్పుడు నేను తీయాలనుకున్న జానర్​ ఇది కాదు.

అయితే, నేను కథ రాయగలను, డైరెక్షన్ చేయగలను. కానీ సెట్​లో​ ఎంతోమంది ఆర్టిస్ట్​లు, టెక్నీషియన్లు ఉంటారు. వాళ్లందర్నీ మేనేజ్ చేస్తూ సినిమా తీయడం పెద్ద టాస్క్​. పైగా అందులో సీనియర్ ఆర్టిస్ట్​లు ఉంటారు. వాళ్లకు సీన్ చెప్పి దానికి తగ్గట్టు యాక్ట్ చేసేలా సరిగ్గా కమ్యూనికేట్ చేయాలి. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయగలం అని అనుకున్నాను. అయితే, శశికుమార్​ వచ్చాక చాలా కంఫర్టబుల్​గా ఫీలయ్యాను. ఎందుకంటే ఆయన సెట్​లోకి రాగానే గౌరవంతో అంతా సైలెంట్ అయిపోతారు. అలా సెట్ వైబ్ అంతా మారిపోతుంది. దాంతో నాకు షూటింగ్ చేయడం ఈజీ అయింది. 

►ALSO READ | Vishwak Sen: సలార్ మ్యూజిక్ డైరెక్టర్కి విశ్వక్ రోలెక్స్ గిఫ్ట్.. వాచ్‌ ఖరీదు తెలిస్తే అవాక్కే!

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ తీశాక నేను ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశానో చూసుకున్నాను. వాటి నుంచి ఎంతో నేర్చుకున్నాను. డైరెక్షన్, యాక్టింగ్ రెండూ కంటిన్యూ చేయాలనుకుంటున్నా. నేను డిప్రెషన్​లో ఉన్నప్పుడు నాకు హై ఇచ్చేది సినిమాలే. ఆ టైంలో చాలామందికి నచ్చిన సినిమాలు చూస్తే వచ్చే ఫీలింగ్ ఎందులోనూ రాదు అనిపిస్తుంది. ఫ్యూచర్​లో ఒకేలాంటి సినిమాలు కాకుండా అన్ని వయసుల వాళ్లకు నచ్చే సినిమాలు చేయాలనుంది. 

రజినీకాంత్​ అలా చెప్పగానే..

నేను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా టూరిస్ట్​ ఫ్యామిలీ సక్సెస్ మరువక ముందే లీడ్ యాక్టర్​గా అవకాశం వచ్చింది. అన్నీ చాలా ఫాస్ట్​గా జరిగిపోతున్నట్టు అనిపించింది. ఆ సినిమాకి నేను డైరెక్టర్​ని కాబట్టి యాక్టింగ్​ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ, ఇక్కడ ఆ కంఫర్ట్​ దొరికింది. ‘విత్ లవ్​’లో లీడ్​ రోల్​లో కనిపించాను. నా కో- డైరెక్టర్​ మదన్ టూరిస్ట్​ ఫ్యామిలీకి ముందే నాకు ఈ స్టోరీలైన్ చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని పేర్లు చెప్పాడు. కానీ, తిరిగి మళ్లీ నా దగ్గరకే వచ్చాడు. కానీ నేను అప్పుడు సీరియస్​గా తీసుకోలేదు.

టూరిస్ట్ ఫ్యామిలీ రిలీజ్ అయ్యాక మళ్లీ నన్ను కలిసి పూర్తిగా కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కాకపోతే నామీద నాకు డౌట్ ఉంది. యాక్సెప్ట్ చేస్తే నేను తెరపై కనిపించాలి అని ఆలోచిస్తున్నప్పుడు సౌందర్య రజినీకాంత్​, ప్రొడ్యూసర్ మగేశ్​కి కథ వినిపించాం. అప్పటికే నేను యాక్టర్​గా లాంచ్ అవుతున్నానని కన్ఫర్మ్ చేశారు. అన్నీ అలా కుదురుతున్నాయి కానీ నేను మాత్రం యాక్టర్​గా యాక్సెప్ట్ చేయలేదు.

నేను చెప్పకుండానే ఒక న్యూస్ బయట లీక్ అయింది. నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. దాంతో నేను ఇంకాస్త వెనక్కి తగ్గా. కానీ సూపర్​స్టార్​ రజినీకాంత్​గారు నాకు ఫోన్​ చేసి ‘నువ్వు హీరో మెటీరియల్’​ అనగానే నాకు ఎక్కడలేని బలం వచ్చింది.