భారీ ఫ్రాంచైజ్ చిత్రాలైన K.G.F, సలార్ వంటి సినిమాలకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సంగీత దర్శకుడు రవి బస్రూర్. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన, ఇపుడు తెలుగులోవిశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్ట్’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విడుదలైన టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో రవి బస్రూర్ తనదైన శైలిలో క్రేజీ మ్యూజిక్ అందించారని మరోసారి నిరూపితమైంది.
రోలెక్స్ వాచ్ గిఫ్ట్!
ఈ టీజర్ లాంచ్ వేడుకలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఆయన వర్క్‌కు ఫిదా అయిన విశ్వక్ సేన్, వేదికపైనే రవి బస్రూర్‌కు ఖరీదైన రోలెక్స్ (Rolex) వాచ్‌ను బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.
►ALSO READ | OTT Sports Thriller: ఓటీటీలో యూత్‌ను ఊపేస్తున్న స్పోర్ట్స్ థ్రిల్లర్.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇది నా ఫేవరెట్ గిఫ్ట్స్‌లో ఒకటి. రవి గారి సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసిందని విశ్వక్ సేన్ అన్నారు. దీనికి రవి బస్రూర్ మాట్లాడుతూ.. నేను 25 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కానీ మొదటిసారి ఒక వ్యక్తి నాలోని సంగీత దర్శకుడిని మాత్రమే కాదు, నన్ను ఇంతలా గౌరవిస్తున్న వ్యక్తి విశ్వక్ అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇది కేవలం వాచ్ మాత్రమే కాదని, సంగీత దర్శకులకు దక్కిన గౌరవమని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వాచ్‌ను విశ్వక్ సేన్ దాదాపు రెండేళ్లు ఎదురుచూసి తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వాచ్ ఖరీదు సుమారు రూ.35 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇకపోతే, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ‘కల్ట్’తో పాటు యశ్ ‘టాక్సిక్’, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ భారీ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.
టీజర్ ఎలా ఉందంటే:
2 నిమిషాల 33 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. రిలీజైన క్షణాల్లోనే భారీ ఇంపాక్ట్ సంపాదించుకుంది. ఒక అండర్ గ్రౌండ్ పార్టీలో మొదలై, ఒక్కసారిగా రక్తపాతంగా మారిపోతుంది. ఒక వింతైన పింక్ టాయ్ (Pink Toy) కారణంగా మొదలయ్యే ఈ గందరగోళం, కత్తులతో పొడుచుకోవడం, భయంకరమైన హత్యలతో నిండిపోయింది. తన మునుపటి చిత్రాలైన 'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా ధమ్కీ' సినిమాలకు పూర్తి భిన్నంగా, విశ్వక్ సేన్ ఈ చిత్రంలో ఒక నీడలాంటి గేమ్ మాస్టర్‌గా కనిపించి షాక్ ఇచ్చారు.
తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటిస్తుండగా, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, కార్తికేయ వంటి వారు కీలక పాత్రల్లో ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఏకంగా 100 మంది కొత్త నటీనటులను విశ్వక్ సేన్ పరిచయం చేస్తున్నారు. ఈ మూవీకి ఆయనే దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
