OTT Sports Thriller: ఓటీటీలో యూత్‌ను ఊపేస్తున్న స్పోర్ట్స్ థ్రిల్లర్.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Sports Thriller: ఓటీటీలో యూత్‌ను ఊపేస్తున్న స్పోర్ట్స్ థ్రిల్లర్.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ యాక్షన్ కామెడీ చిత్రం 'చథా పచ్చ: ద రింగ్ ఆఫ్ రౌడీస్' (Chatha Pacha). మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఫిబ్రవరి 19, 2026 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ మరియు కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది.

అద్వైత్ నాయర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ కామెడీ ఓటీటీలో ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తోంది. డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) స్టైల్ కుస్తీ పోటీల చుట్టూ తిరుగుతూ యూత్ని వీపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఈ మూవీ మలయాళంలో గత నెల 22న రిలీజై రూ. 31.05 కోట్లు రాబట్టింది. ఈ క్రమంలోనే తెలుగులో ఫిబ్రవరి 13న థియేటర్లలోకి తీసుకొచ్చారు. కేవలం 5 రోజుల వ్యవధిలోనే స్ట్రీమింగ్ కి తీసుకొచ్చి ఆశ్చర్యపరిచారు మేకర్స్. ఇకపోతే ఈ స్పోర్ట్స్ థ్రిల్లర్ IMDBలో పదికి 7 రేటింగ్ సంపాదించుకుంది.

కథేంటంటే:

సావియో (అర్జున్ అశోకన్), వెట్రి (రోషన్ మ్యాథ్యూ), థామస్ అలియాస్‌ లిటిల్ (ఇషాన్ షౌకత్).. ముగ్గురు అన్నదమ్ములు. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా కలిసిమెలసి ఉంటారు. కొచ్చిలో పెరుగుతారు. చిన్నప్పుడు వాళ్లకు డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే వాల్టర్ (మమ్ముట్టి) దగ్గర కుస్తీ నేర్చుకుంటారు. కానీ, కొన్నాళ్లకు తల్లితో కలిసి లిటిల్‌ ఢిల్లీకి వెళ్లిపోవాల్సి వస్తుంది.

►ALSO READ | 70th Filmfare Awards: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్లో కూడా పుష్ప గాడి రూల్.. ఫుల్ లిస్ట్ ఇదే..!

మళ్లీ పెద్దయ్యాక సావియో, వెట్రి కోసం సొంతూరికి వస్తాడు. అక్కడే ఒక డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్ ఫైటింగ్ క్లబ్ పెట్టాలి అనుకుంటాడు. కానీ.. అతను వచ్చేసరికి పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. సావియో ఒక లాంచ్‌లో పనిచేస్తుంటాడు. వెట్రి కొన్నేళ్ల నుంచి జైల్లో ఉన్నాడని తెలుసుకుని లిటిల్‌ షాక్ అవుతాడు. తర్వాత ఏమైంది? వెట్రి జైలు నుంచి బయటకొచ్చాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాలి.