70th Filmfare Awards: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్లో కూడా పుష్ప గాడి రూల్.. ఫుల్ లిస్ట్ ఇదే..!

70th Filmfare Awards: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్లో కూడా పుష్ప గాడి రూల్.. ఫుల్ లిస్ట్ ఇదే..!

దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్రకటించారు. 70వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుక శనివారం కొచ్చిలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల చిత్రాలు పలు విభాగాల్లో రేసులో నిలిచాయి. 

2024 సంవత్సరంలో విడుదలైన చిత్రాలను పరిశీలించి అవార్డులను ప్రకటించారు. 'పుష్ప 2: ది రూల్', 'కల్కి 2898 ఏడీ', 'హనుమాన్' ఈ భారీ బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ 2024లో విడుదలైనవే కావడం విశేషం. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కూడా అదే సంవత్సరం విడుదలైంది.

ఇలా స్టార్ హీరోల సినిమాలతో పాటు '35 చిన్న కథ కాదు', 'లక్కీ భాస్కర్' లాంటి కథా ప్రధానమైన సినిమాలు కూడా 2024లో విడుదలై ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నామినేషన్లలో నిలిచాయి. పుష్ప 2: ది రూల్ సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్స్లో కూడా సత్తా చాటింది. 

ఉత్తమ సినిమాగా పుష్ప 2: ది రూల్ సినిమా నిలవగా, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ ఇదే సినిమాకు అవార్డు గెలుచుకున్నారు.  బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ కేటగిరీలో అల్లు అర్జున్కు పుష్ప రాజ్ పాత్రకు గానూ అవార్డు దక్కింది. ఇంకా..  ఏ సినిమా ఏ విభాగంలో అవార్డు గెలుచుకుందో ఓ లుక్కేయండి మరి..

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌:

* ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్
* ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్ (వెంకీ అట్లూరి)
* ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)
* బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్): తేజా సజ్జా (హను-మాన్)
* బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్: అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)
* ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)
* ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
* ఉత్తమ సహాయనటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
* ఉత్తమ సహాయనటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
* ఉత్తమ నేపథ్య గాయని: శిల్పా రావు (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)
* ఉత్తమ నేపథ్య గాయకుడు: శ్రీ కృష్ణ (కుర్చి మడతపెట్టి - గుంటూరు కారం)
* ఉత్తమ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)
* బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2)
* బెస్ట్‌ డెబ్యూ యాక్టర్: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)
* బెస్ట్ డెబ్యూ నటి: నయన్ సారిక (గం గం గణేశ)
* బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ కొరియోగ్రఫీ:

* శేఖర్ మాస్టర్ (కుర్చీ మడతపెట్టి - గుంటూరు కారం) 

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్:

* రామకృష్ణ అండ్ మోనిక (పుష్ప 2)

* నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)