ఫెడరల్ బ్యాంక్‌లో ఉద్యోగాల జాతర: అసోసియేట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. డిగ్రీ పాసైతే చాలు!

ఫెడరల్ బ్యాంక్‌లో ఉద్యోగాల జాతర: అసోసియేట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. డిగ్రీ  పాసైతే చాలు!

ఫెడరల్ బ్యాంక్ అసోసియేట్ ఆఫీసర్ (సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ  మార్చి 04. 

ఖాళీలు: అసోసియేట్ ఆఫీసర్ (సేల్స్). 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్మీడియట్/ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.  

గరిష్ట వయోపరిమితి: 27 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 20.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఇతరులకు రూ.500. ఎస్సీ, ఎస్టీలకు రూ.125. 

లాస్ట్ డేట్: మార్చి 04.

సెలెక్షన్ ప్రాసెస్: గ్రూప్ డిస్కషన్, ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

పూర్తి వివరాలకు www.federal.bank.in/careers వెబ్​సైట్​ను సందర్శించండి.