ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ జూనియర్ ఇంజినీర్, లీగల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 911.
విభాగాల వారీగా ఖాళీలు: లీగల్ అసిస్టెంట్ 10, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) 33, జూనియర్ ఇంజినీర్ 281, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 587.
ఎలిజిబిలిటీ
లీగల్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లీగల్ ప్రాక్టీషనర్‌గా మూడేళ్ల అనుభవం లేదా ప్రభుత్వ విభాగంలో లీగల్ పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
జూనియర్ ఇంజినీర్ (సివిల్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / బోర్డు / ఇన్స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా, సివిల్ ఇంజినీరింగ్ పనుల ప్రణాళిక, అమలు, నిర్వహణలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 24.
లాస్ట్ డేట్: మార్చి 25.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు dsssb.delhi.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
