బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకున్న తర్వాత రిధిమా పాఠక్ రియాక్షన్ ఇది.. 

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకున్న తర్వాత రిధిమా పాఠక్ రియాక్షన్ ఇది.. 

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకున్నారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఇండియన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ రిధిమా పాఠక్.నిర్వాహకులు తనను తొలగించలేదని, ఇండియా బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న రాజకీయ వాతావరణం కారణంగా తానే స్వచ్ఛందంగా   బీపీఎల్ నుంచి తప్పుకున్నానని స్పష్టం చేశారు పాఠక్. ఈమేరకు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చారు రిధిమా పాఠక్.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాఠక్‌ను BPL ప్రెజెంటేషన్ టీం నుండి తొలగించిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ లో ఆమె పాకిస్తాన్‌కు చెందిన జైనాబ్ అబ్బాస్‌తో కలిసి హోస్టింగ్ చేస్తోంది. ఇండియా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ఈ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిర్ రెహమాన్ ను కోల్కతా నైట్ రైడర్స్ నుంచి తప్పించాలంటూ బీసీసీఐ ఆదేశించిన తర్వాత ఇరు బోర్డుల మధ్య హీట్ మరింత పెరిగింది.

ఈ క్రమంలో బీపీఎల్ నుంచి తనను తొలగించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు రిధిమా పాఠక్. తాను స్వచ్చందంగానే బీపీఎల్ నుంచి తప్పుకున్నానంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు రిధిమా పాఠక్. మై నేషన్ కమ్స్ ఫస్ట్ ఆల్వేస్ అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొన్నారు పాఠక్. 

బీపీఎల్ నిర్వాహకులు తనను తొలగించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని... తానే స్వచ్చందంగా తప్పుకున్నానని అన్నారు పాఠక్.ఫ్యాన్స్, ఫాలోవర్స్ నుండి తనకు లభించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు పాఠక్. ఈ విషయంపై తాను ఇకపై కామెంట్స్ చేయబోనని పోస్ట్ లో పేర్కొన్నారు రిధిమా పాఠక్.