ఎల్బీ నగర్ -చౌటుప్పల్ ఆర్టీసీ బస్సులో చోరీ.. వృద్ధురాలి ఏడు తులాల బంగారం మాయం

ఎల్బీ నగర్ -చౌటుప్పల్  ఆర్టీసీ బస్సులో చోరీ..  వృద్ధురాలి ఏడు తులాల బంగారం మాయం

 ఆర్టీసీ బస్సులో ప్రయాణికులే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ వృద్ధురాలి బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు. ఇంటికెళ్లి చూసే సరికి  బ్యాగు గుల్ల చేశారు.

అసలేం జరిగిందంటే.. రణమ్మ అనేవృద్ధురాలు  ఎల్బీనగర్ లోని తన కొడుకు అశ్విని కుమార్ రెడ్డి వద్దకు  వచ్చి తిరిగి తన సొంత ఊరు చౌటుప్పల్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ఎక్కింది. హయత్ నగర్ కు వెళ్ళగానే తన బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి ఉండడాన్ని చూసుకున్న వృద్ధురాలు ఒక్క సారిగా షాక్ అయ్యింది. బ్యాగ్ లో ఉన్న 7 తులాల బంగారం, కొన్ని వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించింది. దీంతో బాధితురాలు హయత్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేుస్తున్నారు.

ఆర్టీసీ బస్సులో వెళ్లేటపుడు ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి. తమ వస్తువులను నిరంతరం అబ్జర్వ్ చేస్తుండాలి. విలువైన వస్తువులు, బంగారం, వెండి ఆభరణాలను తోడు లేకుండా వృద్ధులను ఒంటరిగా పంపొద్దని పోలీసులు సూచిస్తున్నారు.