ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ ఒప్పో (OPPO) Reno15 సిరీస్ కొత్త మోడల్స్ ని 8 జనవరి 2026న మార్కెట్లో విడుదల చేయబొతుంది. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేసే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్లను రూపొందించారు.
ఒప్పో రెనో 15 మోడల్స్:
ఒప్పో నుండి వస్తున్న కొత్త స్మార్ట్ ఫోన్స్ లో టాప్ ఎండ్ మోడల్ రెనో 15 Pro 5G, రెనో 15 మినీ 5G, రెనో 15 5G ఉన్నాయి.
OPPO Reno15 సిరీస్ స్పెసిఫికేషన్లు:
ఒప్పో Reno15 Pro, రెనో Pro Mini మోడల్స్‌లో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. దీనివల్ల ఫొటోలు చాలా క్లియర్‌గా, న్యాచురల్ రంగులతో వస్తాయి. ఫొటోను జూమ్ చేసినా లేదా క్రాప్ చేసినా క్వాలిటీ తగ్గదు.
ఇందులో 50MP టెలిఫోటో కెమెరా ఉంది. Portraits ఫోటోలను చాలా అందంగా, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేస్తూ ప్రొఫెషనల్ కెమెరా తీసినట్టుగా తీస్తుంది. ఇంకా గ్రూప్ ఫొటోలు, సీనరీ వ్యూ కోసం 50MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. ఫొటోలు తీసిన తర్వాత వాటిని ఎడిట్ చేయడానికి కొత్త AI టూల్స్ కూడా ఉన్నాయి. దీని ద్వారా ఫొటోలను మరింత అందంగా మార్చడంలో సహాయపడతాయి.
వీడియో ఫీచర్లు:
ఈ ఫోన్ కెమెరాతో హై క్వాలిటీ 4K వీడియోలను తీయవచ్చు. మీరు నడుస్తూన్న లేదా ప్రయాణిస్తూ వీడియో తీసినా షేక్ అవకుండా క్లియర్ గా వచ్చేలా ప్రత్యేక టెక్నాలజీ (EIS 2.0) వాడారు. యూట్యూబ్ వ్లాగర్స్ కోసం ఒకేసారి రెండు కెమెరాలతో షూట్ చేసే (Dual-view) ఆప్షన్ కూడా ఉంది.
