అబిడ్స్ స్టాన్లీ కాలేజీలో ఏఐ సెమినార్

అబిడ్స్ స్టాన్లీ కాలేజీలో ఏఐ సెమినార్

హైదరాబాద్ సిటీ, వెలుగు: అబిడ్స్​ స్టాన్లీ కాలేజీలో అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ ఉమెన్ ఆధ్వర్యంలో రెండ్రోజుల ఏఐ సెమినార్ గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోనాలి సిర్పూర్‌‌కర్, రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ అశుతోష్ ఝా, ఫ్యాకల్టీ స్పాన్సర్ డా. పి.ఆర్. అనీషా  మాట్లాడుతూ.. సాంకేతికత వేగంగా మారుతున్న కాలంలో విద్యార్థులు కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాకుండా, లీడర్​షిప్ గుణాలను అలవర్చుకోవాలని సూచించారు. కాలేజీ సెక్రటరీ కే. కృష్ణారావు, ప్రిన్సిపాల్ డా. బి.ఎల్. రాజు పాల్గొన్నారు.