పత్తి కొనుగోళ్ల గడువు పెంచాలి : బెల్లంపల్లి నియోజకవర్గ రైతులు

పత్తి కొనుగోళ్ల గడువు పెంచాలి : బెల్లంపల్లి నియోజకవర్గ రైతులు

బెల్లంపల్లి రూరల్, వెలుగు: అకాల వర్షాలు, కూలీల కొరత కారణంగా పత్తి పంట ఆలస్యమైందని, కొనుగోళ్లు తేదీ గడువు పెంచి రైతులను ఆదుకోవాలని కోరుతూ బెల్లంపల్లి నియోజకవర్గ రైతులు గురువారం ఆసిఫాబాద్ కలెక్టర్​హరితకు వినతిపత్రం అందించారు. 2, 3వ విడత పత్తి 40 శాతం ఇంకా చేనుల్లోనే ఉండగా కొనుగోళ్లు నిలిపివేస్తే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. 

పంట ఆలస్యమైన కారణంగా ఫిబ్రవరి 20 తర్వాత కూడా సీసీఐ కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని, ప్రైవేట్​పత్తి మిల్లర్లు కోత విధించకుండా చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ రైతు సంక్షేమ సంఘం రైతులు శరత్, రవి, మణికంఠ, తిరుపతి పాల్గొన్నారు.