కాళేశ్వరం నీళ్లు ఉమ్మడి జిల్లాకు ఏనాడు అందలేదు : ప్రభుత్వ విప్ విజయ రమణారావు

కాళేశ్వరం నీళ్లు ఉమ్మడి జిల్లాకు ఏనాడు అందలేదు :  ప్రభుత్వ విప్ విజయ రమణారావు
  • రూ.5 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

పెద్దపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఉమ్మడి కరీంనగర్​జిల్లాకు ఏనాడు నీరు అందలేదని పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల, తారుపల్లి, మీర్జంపేట, కాల్వ శ్రీరాంపూర్ గ్రామాల్లో రూ.5 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మంగళవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని కేవలం మెదక్, గజ్వేల్ జిల్లాల కోసమే ఉపయోగించుకుందని, ఉమ్మడి కరీంనగర్​జిల్లా ప్రజలకు ప్రయోజనం దక్కలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు సారయ్య గౌడ్, తిరుపతి రెడ్డి, రామచంద్రం రెడ్డి, జి.సదయ్య, మనోహర్ రావు, ఎండీ మునీర్ తదితరులు పాల్గొన్నారు.