నవాబ్‌‌‌‌ కేఫ్‌‌‌‌ కు కనెక్ట్ అవుతారు

నవాబ్‌‌‌‌ కేఫ్‌‌‌‌ కు కనెక్ట్ అవుతారు

శివ కందుకూరి,  తేజు అశ్విని జంటగా ప్రమోద్ హర్ష దర్శకత్వంలో రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శివ కందుకూరి మాట్లాడుతూ ‘ఈ మూవీపై టీమ్ అంతా వందశాతం సంతృప్తితో ఉన్నాం.  మంచి కంటెంట్‌‌‌‌తో వచ్చే చిత్రాలెప్పుడూ ఫెయిల్ కావు అని నమ్ముతుంటాను. ఈ మూవీ చూసిన ప్రతి కొడుకు తన  ఫాదర్‌‌‌‌కి ఫోన్ చేసి మాట్లాడతారు. 

ఇందులోని  ఎమోషన్  కచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఆడియెన్స్ మాకు ఇచ్చే టైం, పెట్టే మనీకి న్యాయం చేసేలా మా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు. సఖి పాత్రలో అందర్నీ అలరిస్తానని హీరోయిన్ తేజు అశ్విని చెప్పింది. ఈ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌‌‌‌కు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ మూవీ విజయంపై నమ్మకంగా ఉన్నామని  నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.