సుహాస్ 2.ఓగా హే బల్‌‌‌‌వంత్

సుహాస్ 2.ఓగా హే బల్‌‌‌‌వంత్

సుహాస్, శివానీ నాగారం జంటగా గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘హే బల్‌‌‌‌వంత్’. బన్నీవాస్‌‌‌‌, వంశీ నందిపాటి శుక్రవారం థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.  గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా  సుహాస్ మాట్లాడుతూ ‘ఇది  నా కెరీర్‌‌‌‌లో బిగ్గెస్ట్ రిలీజ్.  బిగ్గెస్ట్ సక్సెస్ కూడా  అవుతుందనే నమ్మకం ఉంది. ‘హే బల్‌‌‌‌వంత్’ అనేది సుహాస్ 2.ఓ అని గ్యారెంటీ ఇస్తున్నా’ అని అన్నాడు. 

వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘ 650 పైగా స్క్రీన్లలో మా సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం.  వన్ మంత్ డైట్ చేయాల్సిన అవసరం లేకుండా.. వన్ మంత్ జిమ్, రన్నింగ్‌‌‌‌కి వెళ్లాల్సిన పని లేదు. ఒక్క మూడు గంటలు మాకిస్తే.. వన్ మంత్‌‌‌‌కి  సరిపడే ఆరోగ్యాన్ని  మేం  ఇస్తాం. 

ఈ స్టోరీలో మంచి ఎమోషన్‌‌‌‌తో పాటు ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ ఉంటుంది’ అని అన్నారు.  సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.  హీరోయిన్ శివానీ, నటులు వీకే నరేష్​, సుదర్శన్ పాల్గొన్నారు.