జూబ్లీహిల్స్, వెలుగు: ఆన్‌లైన్ లూడో గేమ్‌లో పరిచయం ప్రేమికులుగా మారిన ఓ జంట జల్సాలకు అలవాటు పడి చోరీల బాట పట్టారు. చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి పోలీసులకు చిక్కారు. జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, ఏపీలోని కాకినాడ జిల్లా జగన్నాథపురానికి చెందిన చేసెట్టి రేవతి(33) హైదరాబాద్సనత్నగర్ హిందూ పబ్లిక్ స్కూల్ ప్రాంతంలో నివసిస్తోంది. ఏపీ గుంటూరు జిల్లా పెట్లూరుపాలేనికి చెందిన గిద్దాల నరేంద్ర(23) రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ సనత్‌నగర్ ఏరియాలో ఉంటున్నాడు. ఆన్‌లైన్ లూడో గేమ్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ సినిమాలు, పబ్బులకు వెళ్లేవారు.
జల్సాలకు అలవాటు పడిన వీరు డబ్బుల కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. బంగారం ధరలు పెరగడంతో గొలుసులు దొంగలించాలని భావించారు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో మాదాపూర్ లేడీస్ హాస్టల్‌లో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ మానస జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 39లోని కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తుండగా, బైక్‌పై నరేంద్ర, రేవతి వచ్చారు. మానస మెడలోని బంగారు చైన్ లాక్కొని పరారయ్యారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
