క్లిక్స్ కమ్యూనికేటర్.. ఐఫోన్‌ల కోసం వర్టికల్ కీబోర్డులకు ప్రసిద్ది చెందిన క్లిక్స్ కంపెనీ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కమ్యూనికేటర్ ను క్లిక్స్ కమ్యూనికేటర్ పేరుతో ఆవిష్కరించింది. ఇప్పుడు అందరినీ ఆకట్టుకున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ కమ్యూనికేటర్.క్లిక్స్ కమ్యూనికేటర్ అనేది ఒక పోర్టబుల్ కీబోర్డ్ డివైజ్..ఇది స్మార్ట్‌ఫోన్‌లతో కనెక్ట్ అవుతుంది. క్లిక్స్ కమ్యూనికేటర్ ఒక ఫిజికల్ కీబోర్డ్‌ను అందిస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్ టచ్‌స్క్రీన్ కీబోర్డ్ కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ డివైజ్ టైపింగ్‌ను సులభతరం చేస్తుంది.ఇది ఇమెయిల్‌లు, మెసేజ్‌లు ,డాక్యుమెంట్‌లను రాసేందుకు ఉపయోగపడుతుంది.
ఐఫోన్‌ల కోసం QWERTY వర్టికల్ కీబోర్డులను అందించే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ క్లిక్స్ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను క్లిక్ కమ్యూనికేషర్ ను ఆవిష్కరించింది. ఇది క్లాసిక్ బ్లాక్‌బెర్రీని పోలి ఉంటుంది. క్లిక్స్ కమ్యూనికేషన్ అని పిలువబడే ఈ డివైజ్ ను కేవలం కమ్యూనికేషన్ కోసం కాదు..వినియోగం లక్ష్యంగా కంపెనీ తయారు చేసింది. ముఖ్యంగా మేసేజ్ లకో పనిచేసే సెకండరీ ఫోన్ గా ఈ డివైజ్ ను రూపొందించారు.
Also Read : మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు?
హార్డ్‌వేర్ విషయానికి వస్తే.. క్లిక్స్ కమ్యూనికేషన్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 తో పనిచేస్తుంది. 4-అంగుళాల కాంపాక్ట్ OLED డిస్‌ప్లే, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ,2TB వరకు పెంచుకునేందుకు స్టోరేజ్ సపోర్టుతో మైక్రో SD కార్డు స్లాట్ ఉంది. ప్రాంప్ట్ కీ అని పిలువబడే ప్రత్యేక సైడ్ బటన్ ఉంటుంది. ఇది వాయిస్‌ని టెక్స్ట్‌గా మార్చడానికి, వాయిస్ రికార్డింగ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఏదైనా మీటింగులు, ప్రెస్ మీట్ వంటి వాటిని కవర్ చేసేందుకు ఉపయోగించవచ్చు.
ఇక కీబోర్డు విషయానికి వస్తే.. భౌతిక కీబోర్డ్ టచ్-సెన్సిటివ్ కీప్యాడ్‌గా కూడా పనిచేస్తుంది. ఇది ఇన్‌బాక్స్, మేసేజ్ లు , వెబ్ పేజీల ద్వారా స్క్రోల్ చేసేందుకు సులభతరం చేస్తుంది. ఈ డివైజ్ లో ఓ ప్రత్యేకమైన ఆప్షన్ ఉంది. స్పేస్ బటన్‌లో థంబ్ సెన్సార్ ఉంటుంది. ఇక ఈ క్లిక్స్ డివైజ్ లో కాంటాక్ట్‌లు ,అప్లికేషన్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లను తెలిపే LED కూడా ఉంది.
స్టోరేజ్ విషయానికి వస్తే..256 GB స్టోరేజ తో పాటు 50 MP బ్యాక్ సైడ్ కెమెరా, 24 MP సెల్ఫీ షూటర్ సెటప్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఐఫోన్ లో మాదిరిగా ఫిజికల్ సిమ్, eSIM సపోర్టుతో వస్తుంది. Qi వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4000mAh బ్యాటరీతో సపోర్టు ఉంటుంది. ఇక కనెక్టివిటీ విషయంలో 4G, 5G రెండింటికీ సపోర్టు చేస్తుంది.
లభ్యత..
క్లిక్స్ కమ్యూనికేషన్ మొదట్లో అమెరికాలో అందుబాటులోకి వస్తుంది. స్మోక్, క్లోవర్ , ఓయింక్స్ మూడు కలర్లలో లభిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.45వేలు. అయితే ఫిబ్రవరి 27 కి ముందు బుక్ చేసుకున్న వారికి దాదాపు రూ.10వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ఈ ఏడాది చివర్లో షిప్పింగ్ మొదలవుతుంది. వచ్చే వారం లాస్ వెగాస్‌లో జరిగే CES 2026లో ప్రదర్శించబడుతుంది.
