స్మార్ట్ ఫోన్..ప్రతి మనిషి దైనందిన జీవితంలో ఓ భాగం అయిపోయింది. కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమేకాదు..ఎంటర్ టైన్ మెంట్, ట్రాన్సాక్షన్స్ అన్నీ స్మార్ట్ ఫోన్ తోనే. స్మార్ట్ ఫోన్స్ కొనేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో ఫీచర్ ప్రధానంగా ఉండాలని కోరుకుంటారు. కొందరు మంచి కెమెరా ఉండాలని కోరుకుంటే మరికొందరు స్టైలిష్‌గా ఉండాలని అనుకుంటారు. అలానే గేమింగ్ అంటే ఇష్టపడేవారు కూడా ఉంటారు. అలా గేమ్స్ కోసం మంచి ఫోన్ తీసుకోవాలి అనుకునేవారికోసం కొత్త ఏడాదిలో రూ.30వేల లోపు బడ్జెట్ లో మార్కెట్ లో ఉన్న 5 బెస్ట్ మొబైల్స్ గురించి తెలుసుకుందాం..
రూ.30వేలలోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు
2026లో గేమింగ్ ప్రియులకు బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ బెస్ట్ గేమింగ్ ఫోన్లు వినియోగదారులకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. వీటిలో మంచి ఫీచర్లు ఉండటంతో పాటు తక్కువ బడ్జెట్ లో లభిస్తున్నాయి.
ఇన్ఫినిక్స్ జిటి 30 ప్రో (Infinix GT 30 Pro)..
ఈ స్మార్ట్ ఫోన్ లో
1B రంగులతో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే
144 Hz రిఫ్రెష్ రేట్
డ్యూయల్ కెమెరా - 108MP + 8MP , 13MP సెల్ఫీ కెమెరా
మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ చిప్‌సెట్
ఆపరేటింగ్ సిస్టమ్‌గా XOS 15 పై నడుస్తుంది
ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 25,999
Oppo K13 టర్బో..
ఈ స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ బ్యాకప్ అదిరింది. గేమింగ్ ఆడేవారికి ఇది బెస్ట్ వన్..
7000 mAh బ్యాటరీ , 80W ఛార్జర్
Oppo K13 Turbo స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్
1B రంగులతో 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లే
120 Hz రిఫ్రెష్ రేట్, 1600 nits పీక్ బ్రైట్‌నెస్
Adreno 825 GPU ,GHz Cortex-A720 CPUని కలిగి ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ ధర.24,999
వన్‌ప్లస్ నార్డ్ CE 5..
OnePlus Nord CE 5 లో 6.77-అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే
1B కలర్స్ ,120 Hz రిఫ్రెష్ రేట్
MediaTek Dimensity 8350 Apex చిప్‌సెట్
ఈ యూనిట్ మాలి G615-MC6 GPU ,కార్టెక్స్-A510 CPU ని అందిస్తుంది
ఇది 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5200 mAh బ్యాటరీని కలిగి ఉంది.
ధర రూ.22వేల999
iQOO నియో 10R..
6400 mAh బ్యాటరీ ,80 W ఛార్జింగ్ కిట్
iQOO నియో 10R 6.78-అంగుళాల AMOLED డిస్ ప్లే
1B రంగులు, 144 Hz రిఫ్రెష్ రేట్ 4500 nits పీక్ బ్రైట్‌నెస్
32MP సెల్ఫీ కెమెరాతో 50MP వెడల్పు ,8MP అల్ట్రావైడ్ కెమెరా
ధర రూ. 28వేల852
వివో T4 ప్రో..
Vivo T4 Proలో ట్రిపుల్ 50MP కెమెరా ,32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 చిప్‌సెట్ ఆధారిత Funtouch 15 పై నడుస్తుంది
1B రంగులతో 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లే
120 Hz రిఫ్రెష్ రేట్ ,5000 nits పీక్ బ్రైట్‌నెస్
గేమ్స్ కోసం మంచి ఫోన్ తీసుకోవాలి అనుకునేవారికోసం కొత్త ఏడాదిలో తక్కువ బడ్జెట్ లో మార్కెట్ లో 5 బెస్ట్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి మిగితా గేమింగ్ ఫోన్ ల కంటే తక్కువ ధరకే వచ్చినప్పటికీ పర్ఫామెన్స్‌లో మాత్రం సమాన పోటీ ఇస్తున్నాయి.
