ఇక్కడ నేరాలు .. విదేశాలకు పరార్

ఇక్కడ నేరాలు .. విదేశాలకు పరార్

తెలంగాణలో  పలు కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నవాళ్లంతా విదేశాల్లో తలదాచుకుంటున్నారు. గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్ కేసులోని నిందితులు దుబాయ్, కెనడా, అమెరికాలో ఉన్నారు. నిందితులను విచారిస్తేనే కేసులు కొలిక్కి వచ్చే అవకాశం ఉండటంతో .. వారిని ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

గొర్రెల స్కాం ప్రధాన నిందితులు  సయ్యద్ మోహిదుద్దీన్ దుబాయ్ లో  ,లక్ష్మారెడ్డి  కెనడాకు పారిపోయారు. విచారణకు సహకరించకుండా విదేశాల్లో ఉంటున్నారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ SIB  చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్నారు.ఇప్పటికే వీరికి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. నిందితుల్ని విచారిస్తేనే కేసులు కొలిక్కి వచ్చే చాన్స్ ఉంది. 

 ప్రజాభవన్ దగ్గర భారీ కేడ్లను ఢీ కొట్టిన కేసులో కొడుకును తప్పించే కుట్రలో  బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ కి పారిపోయారు. ఇప్పటికీ అక్కడే ఉన్నారు.