Traffic Alert:జూన్​ 17న నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు.. ఎందుకంటే..

Traffic Alert:జూన్​ 17న నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు.. ఎందుకంటే..

హైదరాబాద్ వాహనదారులకు కీలక గమనిక.... రేపు ( జూన్​ 17)  నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు.  ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా అధికారులు పలు ఏర్పాట్లు చేశారు.ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఇన్చార్జి ట్రాఫిక్ జాయింట్ సీపీ విశ్వనాథ్ తెలిపారు.  మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను దారి మళ్లిస్తామని పేర్కొన్నారు. 

పురానాపూల్, కమాటిపురా మరియు కిషన్‌బాగ్ వైపు నుండి ఈద్గా ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే బహదూర్‌పురా క్రాస్ రోడ్ మీదుగా ఉదయం 8:00 నుండి 11:30 వరకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. బక్రీద్ ప్రార్థనల సందర్భంగా మాసబ్ ట్యాంకు సమీపంలోని మీర్ ఆలం దర్గా, హాకీ గ్రౌండ్, లంగర్ హౌస్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమలు చేస్తున్నారు. 

బక్రీద్ నేపథ్యంలో జూన్​ 17న ఉదయం నుంచి ప్రార్థనలు చేసేందుకు అధిక సంఖ్యలో ముస్లింలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ముందు ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు.  ఈద్గాల సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాల్లో ప్రార్థనలు చేసేందుకు వచ్చే ముస్లింలు వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రార్థనలకు వచ్చే వాళ్లు, వాహనదారులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను గుర్తించాలని అధికారులు స్పష్టం చేశారు.

 నగరంలోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు వివిధ ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రార్థనలు జరిగే పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నామన్నారు.పాతబస్తీలోని పలు రహదారులపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాత బస్తీలో ప్రార్థనలకు వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం కోసం జూ పార్క్, మసీదు అల్హా హో అక్బర్ ముందు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సోమవారం (జూన్ 17) ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

 సోమవారం పాత బస్తీలో సుమారు 1000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు వారు తెలిపారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న మీరాలం ఈద్ సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రార్థనలకు 30 వేల  మందికి పైగా ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.