అమెరికా అధ్యక్ష ఎన్నికలు..కమలా హారిస్ గెలవాలని ఇండియాలో పూజలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు..కమలా హారిస్ గెలవాలని ఇండియాలో పూజలు

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమెక్రాటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా కమలా హారిస్ విజయం సాధించాలని తమిళనాడులో తన తల్లితండ్రులు నివాసం ఉన్న ఓ గ్రామంలోని ప్రత్యేక పూజలు జరిగాయి.

యూఎస్ లో  పోలింగ్ సందర్భంగా  చెన్నైకి దక్షిణాన 390 కిలోమీటర్ల  తులసేంద్రపురం అనే గ్రామంలో కమలా హారీస్ కుటుంబ సభ్యులు  నివసించేవారు. ఆ గ్రామప్రజలే  కమలా హారిస్ విజయం సాధించాలని పూజలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా గ్రామంతో కుటుంబానికి ఉన్నసంబంధంపై  హారిస్ అత్త డాక్టర్ సరాలా గోపాలన్ స్పందించారు. ఆలయ దేవుడు మా తండ్రి కుటుంబ దేవత. కుటుంబంలో వివాహం లేదా ప్రత్యేక సందర్భం జరిగినప్పుడల్లా మేము ఆలయాన్ని సందర్శిస్తామన్నారు.  ఆమె సాధించిన విజయాల పట్ల మేము సంతోషంగా మరియు గర్వంగా ఉన్నాం. ఈ గ్రామ మూలాలున్న కమల యూఎస్ వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించాలని ఆలయ అధికారి రమణ తెలిపారు.